English | Telugu

'అఖండ' కలెక్షన్స్ డ్రాప్!

'సింహా', 'లెజెండ్' తర్వాత నటసింహం బాలకృష్ణ, డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబినేషన్ లో వచ్చిన హ్యాట్రిక్ మూవీ 'అఖండ' ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. బాలయ్య నటవిశ్వరూపానికి కలెక్షన్ల వర్షం కురిసింది. డిసెంబర్ 2 న విడుదలైన అఖండ ఇప్పటిదాకా రూ.10 కోట్లకు పైగా లాభాలు సాధించి సాలిడ్ హిట్ గా నిలిచింది. అయితే గురువారం(డిసెంబర్ 16) నుంచి అఖండ కలెక్షన్లు డ్రాప్ అయ్యాయి.

Also read:'పుష్ప' మూవీ రివ్యూ

మా సినిమా 50 రోజులు, 100 రోజులు ఆడిందని చెప్పుకునే ట్రెండ్ పోయింది. సినిమా వచ్చిందా.. వారం, రెండు వారాల్లో కలెక్షన్లు కొల్లగొట్టి హిట్ గా నిలిచిందా అనేదే గత కొన్నేళ్లుగా మనం చూస్తున్న ట్రెండ్. ఇప్పుడు అఖండ విషయంలోనూ అదే జరిగింది. ఓమిక్రాన్, టికెట్ రేట్ల తగ్గింపు వంటి ఎన్నో ప్రతికూలతల నడుమ విడుదలైన అఖండ.. అంచనాలకు మించిన విజయాన్ని అందుకుంది. చాలా కాలం తర్వాత జనాలు థియేటర్స్ కి క్యూ కట్టేలా చేసిన సినిమా అఖండనే అని చెప్పొచ్చు. అందుకే కలెక్షన్ల వర్షం కురిసింది. 53 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరుపుకున్న అఖండ.. 15 రోజుల్లో దాదాపు 64 కోట్ల షేర్ రాబట్టింది. అయితే 14వ రోజుతో పోల్చితే 15వ రోజు కలెక్షన్స్ 20 శాతానికి పైగా డ్రాప్ అయినట్లు తెలుస్తోంది. 14వ రోజు 45 లక్షలు షేర్ వసూలు కాగా.. 15వ రోజు 30 లక్షలకు పడిపోయినట్లు సమాచారం.

Also read:సంక్రాంతి త‌రువాతే బాల‌య్య కొత్త చిత్రం!

నేడు(డిసెంబర్ 17) పుష్ప విడుదల కావడంతోపాటు, ఇప్పటికే విడుదలై రెండు వారాలు దాటిపోవడంతో.. ఇక అఖండ బాక్స్ ఆఫీస్ విజృంభణ దాదాపు ముగిసిందనే చెప్పొచ్చు. ఫైనల్ గా అఖండ రూ.11 కోట్ల లాభంతో బాక్స్ ఆఫీస్ విన్నర్ గా నిలిచే అవకాశముంది.

అవతార్ 3 ఫస్ట్ డే కలెక్షన్స్ ఇవే.. ఇండియాలో మాత్రం ఆ సినిమా దెబ్బకొట్టిందా!

జేమ్స్ కామెరూన్ నుంచి వచ్చిన మరో అద్భుత సృష్టి 'అవతార్ ఫైర్ అండ్ యాష్' నిన్న వరల్డ్ వైడ్ గా కనివిని ఎరుగని రీతిలో అత్యధిక థియేటర్స్ లో విడుదలైంది.ఒక్క ఇండియాలోనే అన్ని లాంగ్వేజెస్ లో కలిపి 5200 షోస్ ని ప్రదర్శించారంటే ఏ స్థాయిలో రిలీజ్ అయ్యిందో అర్ధం చేసుకోవచ్చు. దీంతో ప్రపంచ వ్యాప్తంగా ఉన్న సినీ ప్రేమికులు పెద్ద ఎత్తున థియేటర్స్ కి  పోటెత్తడంతో అన్ని చోట్ల హౌస్ ఫుల్ బోర్డ్స్ దర్శనమిచ్చాయి. తెలుగు రాష్ట్రాలతో సహా ఇండియా మొత్తం ఇంచుమించు అదే పరిస్థితి. దీంతో తొలి రోజు  అవతార్ ముంగిట భారీ కలెక్షన్స్ వచ్చి చేరాయి.