English | Telugu

"పూలరంగడు" వంద రోజులు పూర్తి

"పూలరంగడు" వంద రోజులు పూర్తిచేసుకుంది. ఆర్ ఆర్ మూవీమేకర్స్ సమర్పణలో, మ్యాక్స్ ఇండియా పతాకంపై, సిక్స్ ప్యాక్ రాయల్ హీరో సునీల్ హీరోగా, ఇషా చావ్లా హీరోయిన్ గా, పనే దైవంగా భావించే "అహ నా పెళ్ళంట" ఫేం వీరభద్రం చౌదరి దర్శకత్వంలో, సీనియర్ నిర్మాత కె.అచ్చిరెడ్డి నిర్మించిన చిత్రం"పూలరంగడు". ఈ "పూలరంగడు" చిత్రం ఈ రోజుకి అంటే "మే" 27 వ తేదీకి వందరోజులు పూర్తిచేసుకుంది.

సినిమా విడుదలైన రెండో వారం కూడా దాటకుండానే బాక్సులు వెనక్కు వచ్చేస్తున్న ఈ రోజుల్లో "పూలరంగడు" చిత్రం శతదినోత్సవం జరుపుకోవటం చాలా ప్రశంసనీయం...ముదావహం...హర్షణీయం...! ఈ చిత్ర విజయానికి వీరభద్రం చౌదరి దర్శకత్వ ప్రతిభ, హీరో సునీల్ నటన, డ్యాన్సులు, నిర్మాత అచ్చిరెడ్డి రాజీపడని నిర్మాణపు విలువలు కారణం.