English | Telugu

"ఆదిత్య 369" సీక్వెల్లో బాలయ్య సరసన అనుష్క

"ఆదిత్య 369" సీక్వెల్లో బాలయ్య సరసన అనుష్క హీరోయిన్ గా నటించనుందని విశ్వసనీయవర్గాల ద్వారా అందిన సమాచారం. గతంలో యువరత్ననందమూరి బాలకృష్ణ హీరోగా నటించిన "ఒక్క మగాడు" చిత్రంలో అనుష్క హీరోయిన్ గా నటించింది. కానీ ఆ చిత్రం ఫ్లాపవటంతో మళ్ళీ బాలకృష్ణ సరసన అనుష్క నటించలేదు.

మళ్ళీ ఇప్పుడు సింగీతం శ్రీనివాసరావు దర్శకత్వంలో, నందమూరి బాలకృష్ణ హీరోగా నటించబోయే "ఆదిత్య 369" చిత్రం సీక్వెల్లో అనుష్క హీరోయిన్ గా నటించనుందని ఫిలిం నగర్ వర్గాలంటున్నాయి. తొంభైలలో వచ్చిన సైంటిఫిక్ హిస్టారికల్ ఫిక్షన్ చిత్రం "ఆదిత్య 369" అప్పట్లో బ్లాక్ బస్టర్ హిట్టయ్యింది.