English | Telugu

పాలిటిక్స్‌ అంటే ఆ హీరోకి కామెడీ అయిపోయింది!!

కమెడియన్లలో సంపూర్ణేష్‌బాబుది ఓ విభిన్న శైలి. యాక్షన్‌ సీక్వెన్స్‌లలో తన సాహసకృత్యాలతో అందర్నీ నవ్విస్తూ బర్నింగ్‌ స్టార్‌గా పేరు తెచ్చుకున్న సంపూర్ణేష్‌ ఇప్పుడు ‘మార్టిన్‌ లూథర్‌ కింగ్‌’గా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. 2022లో విడుదలైన ‘హాఫ్‌ స్టోరీస్‌’ తర్వాత సంపూర్ణేష్‌ చేస్తున్న సినిమా ఇది. మహాయాన మోషన్‌ పిక్చర్స్‌ పతాకంపై శశికాంత్‌, చక్రవర్తి రామచంద్ర ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. పూజా అపర్ణ కొల్లూరు అనే అమ్మాయి ఈ సినిమా ద్వారా దర్శకురాలిగా పరిచయం అవుతోంది. ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్‌లుక్‌ను విడుదల చేసింది చిత్ర యూనిట్‌.
తమిళ్‌లో యోగిబాబు హీరోగా రూపొందిన ‘మండేలా’ చిత్రానికి ‘మార్టిన్‌ లూథర్‌ కింగ్‌’ రీమేక్‌. ఈ సినిమా పొలిటికల్‌ బ్యాక్‌డ్రాప్‌లో రూపొందుతోందని ఫస్ట్‌లుక్‌ చూస్తే అర్థమవుతుంది. అక్టోబర్‌ 27న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. దిల్‌రాజు సంస్థ శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్‌ ద్వారా ఈ సినిమా విడుదలవుతుంది. తన కామెడీతో ప్రేక్షకుల్ని ఉర్రూతలూగించిన సంపూర్ణేష్‌ తన స్టయిల్‌లోనే పొలిటికల్‌ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతున్న ‘మార్టిన్‌ లూథర్‌ కింగ్‌’లో కూడా అలరిస్తాడని నిర్మాతలు చెబుతున్నారు.