English | Telugu

తమిళనాడులో పవన్ కళ్యాణ్ పై పోలీసు కేసు..అరెస్ట్ చేస్తారా?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్(pawan kalyan)ఇటీవల కలియుగ దైవం తిరుమల తిరుపతి లడ్డు విషయంలో జరిగిన అపచారానికి ప్రజల తరుపున ప్రాయచ్చిత దీక్ష తీసుకొని విరమణ గావించిన విషయం తెలిసిందే. ఆ తర్వాత తిరుపతిలో ఒక బహిరంగ సభ నిర్వహించి సనాతన ధర్మానికి అడ్డొచ్చిన వాళ్ళని వదలమని పరోక్షంగా తమిళనాడు డిప్యూటీ సిఎం ఉదయనిధి స్టాలిన్ ని ఉద్దెశించి చెప్పాడు.

ఇప్పుడు ఈ విషయంపై తమిళనాడు లో పవన్ కళ్యాణ్ పై పోలీసు కేసు నమోదు అయ్యింది. ఉదయనిధి స్టాలిన్(udhayanidhi stalin)పై పవన్ అనుచిత వ్యాఖ్యలు చెయ్యడంతో పాటుగా, . మైనారిటీ ల పై కూడా అనుచిత వ్యాఖ్యలు చేశాడంటూ వాంజినాదన్ అనే న్యాయవాది మదురై కమిషనరేట్ లో ఫిర్యాదు చేసాడు.ఉదయనిధి వ్యాఖ్యలని పవన్ వక్రీకరించారని కూడా అందులో పేర్కొన్నాడు.