English | Telugu
సినీ పరిశ్రమ ఏ ఒక్కరిది కాదు: పవన్
Updated : Jan 17, 2014
సాయిధరమ్ తేజ్ హీరోగా వైవియస్ చౌదరి దర్శకత్వంలో తెరకెక్కుతున్న "రేయ్" చిత్ర ఆడియో విడుదల కార్యక్రమం నిన్న హైదరాబాద్ లో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా పవన్ కళ్యాణ్ విచ్చేసారు. ఈ సందర్భంగా పవన్ మాట్లాడుతూ... తేజ్ సినిమాల్లోకి వస్తాను అని అన్నప్పుడు.. నాకు తెలిసిన యాక్టింగ్ ఇన్స్టిట్యూట్ కి పంపించాను. ఈ సినిమా కోసం నేనేం చేయలేదు. తేజ్ తో ఓ సినిమా చేస్తాను అని చౌదరి అడిగాడు. కానీ అతనికి నాకు ఎలాంటి సంబంధం లేదు. మీరు ఈ విషయం తేజ్ ను అడిగి తెలుసుకోండి. ఎందుకంటే నేను ఎలాంటి ఒత్తిడి చేయలేను కదా. నేను కేవలం మాట సహాయం మాత్రమే చేశాను. ఓ నటుడు ఏదైనా సాధించాలంటే అతని పట్టుదల, కృషి మీదే ఆధారపడి ఉంటుంది. వారసత్వం, కుటుంబం వల్ల సాధించలేరు అని తేజ్ తో చెప్పను. సినిమా పరిశ్రమ ఏ ఒక్క కుటుంబానికో చెందినది కాదు. అందుకే మా కుటుంబానిది కాదు. అందుకే మా కుటుంబం నుంచి వస్తున్న హీరో అనడానికి ఇష్టపడటంలేదు. అందుకే నితిన్ లాంటి కొత్త కొత్త హీరోల ఆడియో ఫంక్షన్ లకు హాజరయ్యేవాడిని. ఈ సినిమా ద్వారా పరిచయం అవుతున్న ఈ కొత్త హీరోకి శుభాకాంక్షలు చెబుతున్నాను. అదే విధంగా "దేవదాసు" సినిమా సమయంలో చౌదరి గురించి విన్నాను. అతను చాలా పట్టుదల ఉన్న వ్యక్తి. ఈ సినిమాకి చాలా కష్టాలొచ్చాయి. కానీ ఎక్కడ నీరసపడిపోకుండా చౌదరి పట్టుదలతో ఈ సినిమాను పూర్తి చేసారు. చక్రి సంగీతం నాకు ఇష్టం. ఆయన పాటలు చాలా ఊపుగా ఉంటాయి.