English | Telugu
బెంగాలీలో బ్లాక్ బ్యూటీ పెళ్ళి
Updated : Jan 18, 2014
బాలీవుడ్ బ్లాక్ బ్యూటీ బిపాసాబసు గతకొద్దికాలంగా నటుడు హర్మాన్ బవేజాతో డేటింగ్ చేస్తున్న విషయం అందరికి తెలిసిందే. త్వరలోనే పెళ్లి చేసుకోవాలని బిపాసా నిర్ణయించుకుంది. వీరి పెళ్ళికి ఇరుకుటుంబసభ్యులు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసారు. కానీ పెళ్లి మాత్రం బెంగాలీ సంప్రదాయంలో చేసుకుంటేనే పెళ్లికి వస్తానంటూ బిపాసా తల్లి కండిషన్ పెట్టిందట. దాంతో చేసేదేమీలేక బిపాసా వెంటనే ఒప్పేసుకుంది. అయితే ఈ అమ్మడు ఫిట్ నెస్ సూత్రాలతో తాజాగా సీడీలను విడుదల చేసింది. ఈ సందర్భంగా బిపాషా ముంబైలో మీడియాతో మాట్లాడింది. తన పెళ్లిలో ఎవరూ డ్యాన్స్ చేయకూడదని, కేవలం ఎక్సర్ సైజ్ మాత్రమే చేయాలని కోరింది. బిపాసా ఇప్పటికైనా ఓ మంచి నిర్ణయం తీసుకుందని అందరు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.