English | Telugu
విడుదలకు ముందే పవన్ సినిమా లీక్...!
Updated : Sep 23, 2013
పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన "అత్తారింటికి దారేది" చిత్రం అక్టోబర్ 10వ తేదీన విడుదల కావలసి ఉంది. అయితే ఈ చిత్రాన్ని విడుదలకు ముందే లీక్ చేసేసారు. దీంతో ఈ చిత్రాన్ని మరోసారి వాయిదా వేసినట్లు తెలిసింది. ఈ చిత్ర విడుదల తేదిని త్వరలోనే అధికారికంగా ప్రకటించనున్నారు. త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని బి.వి.ఎస్.ఎన్. ప్రసాద్ నిర్మించారు. దేవిశ్రీప్రసాద్ సంగీతం అందించిన ఈ చిత్రంలో పవన్ సరసన సమంత, ప్రణీత హీరోయిన్లుగా నటించారు. మరి ఈ చిత్రం ఇంకెన్ని అవాంతరాలకు ఎదురుకానుందో చూడాలి.