English | Telugu

'గుంటూరు కారం'కి 'ఒక్కడు' సెంటిమెంట్

సూపర్ స్టార్ మహేష్ బాబు సినీ కెరీర్ లో 'ఒక్కడు' సినిమాకి ప్రత్యేక స్థానం ఉంటుంది. గుణశేఖర్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా 2003 లో విడుదలై ఘన విజయం సాధించింది. ఇందులో మహేష్ కబడ్డీ ప్లేయర్ గా కనిపించాడు. కబడ్డీ నేపథ్యంలో రూపొందిన పతాక సన్నివేశాలు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. అయితే ఇప్పుడు ఈ 'ఒక్కడు' సెంటిమెంట్ 'గుంటూరు కారం'కి తోడు కానుంది.

'అతడు', 'ఖలేజా' తర్వాత మహేష్ బాబు, దర్శకుడు త్రివిక్రమ్ కలయికలో రూపొందుతోన్న చిత్రం 'గుంటూరు కారం'. హారిక & హాసిని క్రియేషన్స్ నిర్మిస్తున్న ఈ సినిమాలో మహేష్ మాస్ అవతార్ చూడబోతున్నామని ఇప్పటికే మేకర్స్ గ్లింప్స్ తో చెప్పేశారు. అయితే ఇప్పుడు ఈ సినిమాకి సంబంధించి ఓ ఆసక్తికర న్యూస్ వినిపిస్తోంది. ఈ సినిమాలో అదిరిపోయే కబడ్డీ యాక్షన్ సీక్వెన్స్ ఉందట. ఇది సినిమాకే హైలైట్ గా నిలవనుంది అంటున్నారు.

'గుంటూరు కారం'లో శ్రీలీల హీరోయిన్ గా నటిస్తోంది. ఈ సినిమా సంక్రాంతి కానుకగా 2024, జనవరి 13న విడుదల కానుంది. అప్పుడు కబడ్డీ ప్లేయర్ గా ఒక్కడుతో ఘన విజయాన్ని అందుకున్న మహేష్, ఇప్పుడు కబడ్డీ యాక్షన్ ఎపిసోడ్ తో 'గుంటూరు కారం'కి అదే మ్యాజిక్ రిపీట్ చేస్తాడేమో చూడాలి.