English | Telugu

ముద్దు సీను 90 సెకన్ల పాటు వుంటుందట

సొంతవూరు, గంగపుత్రులు తదితర చిత్రాలతో ఎన్నో పురస్కారాలు గెలుచుకున్న సునీల్‌కుమార్ రెడ్డి తాజా చిత్రం ‘ఒక క్రిమినల్ ప్రేమకథ’. బాలీవుడ్ తరహాలో ప్రస్తుతం టాలీవుడ్ సినిమా రంగంలో లిప్ లాక్‌ సీన్లు సాధారణమయ్యాయి. యూత్ ఆడియెన్స్ ను థియేటర్లకు రప్పించుకోవడానికి ఇదొక సాధనంగా మారుతోంది. యంగ్ హీరోలు కొత్త హీరోల సినిమాలలో ఈ సన్నివేశాలతో ప్రయోగాలు చేస్తున్నారు. ‘ఒక క్రిమినల్ ప్రేమకథ’ చిత్రంలోనూ ఇలాంటి సీన్ వుంది. అయితే 90 సెకన్ల ఈ సీన్ చిత్రీకరించడానికి 9 గంటల సమయం పట్టిందట. మనోజ్, ప్రియాంకా పల్లవిలు నటిస్తున్న ఈ సినిమాలో సీన్ షూట్ చేయడానికి డైరెక్టర్ సునీల్ కుమార్ రెడ్డి ఇంత సమయం వెచ్చించాల్సి వచ్చిందట. ఇంత సుదీర్ఘమైన ముద్దు సీన్ ఇప్పటివరకూ తెలుగు తెరపై కనిపించలేదని చిత్ర యూనిట్ సభ్యులు అంటున్నారు. ఈ చిత్రం త్వరలోనే విడుదల చేయనున్నట్లు నిర్మాత రవీంద్రబాబు తెలిపారు.