English | Telugu

తెల్లాపూర్ లో ఫైట్ చేస్తున్న ఎన్టీఆర్

ఎన్టీఆర్ హీరోగా "కందిరీగ" దర్శకుడు శ్రీనివాస్ దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కుతుంది. ఈ చిత్ర షూటింగ్ ఇటీవలే ప్రారంభమయ్యింది. ప్రస్తుతం ఈ చిత్ర షూటింగ్ తెల్లాపూర్ లో జరుగుతుంది. ఈ చిత్రానికి సంబంధించిన కొన్ని యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు.

శ్రీ సాయి గణేష్ ప్రొడక్షన్స్ బ్యానర్లో నిర్మాత బెల్లంకొండ సురేష్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో ఎన్టీఆర్ సరసన సమంత హీరోయిన్ గా నటిస్తుంది. ఈ చిత్రానికి అనూప్ రూబెన్స్ సంగీతం సమకూరుస్తున్నాడు. ఈ చిత్రానికి సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలోనే తెలియనున్నాయి.