English | Telugu
పవన్ కు పోటీగా "వర్ణ" ట్రైలర్
Updated : Aug 8, 2013
ఇటీవలే పవన్ కళ్యాణ్ నటించిన "అత్తారింటికి దారేది" చిత్ర ట్రైలర్ విడుదలై, రికార్డు స్థాయిలో హిట్స్ వచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఆ రికార్డులను బ్రేక్ చేసే విధంగా హీరోలతో సమానంగా పోటీ పడుతుంది హీరోయిన్ అనుష్క. అనుష్క నటిస్తున్న తాజా తెలుగు,తమిళ చిత్రం "వర్ణ". ఈ చిత్ర ట్రైలర్ ఇటీవలే విడుదలై మంచి స్పందనను సంపాదించుకుంటుంది. ఆదివారం విడుదలైన ఈ చిత్ర ట్రైలర్ ను ఇప్పటికే 6 లక్షలకు పైగా మంది చూశారు. ఈ విధంగా అనుష్క కూడా స్టార్ హీరోలతో సమానమైన ఫాలోయింగ్ ఉందనే చెప్పుకోవచ్చు.
సెల్వ రాఘవన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో అనుష్క కు జంటగా ఆర్య నటిస్తున్నాడు. పూర్తి ఆసక్తికరంగా ఉన్న చిత్ర ట్రైలర్ ను చూస్తే "అవతార్" వంటి గ్రాఫిక్స్ చిత్రాలు గుర్తొస్తున్నాయి. మరి ఈ చిత్రం ట్రైలర్ కే ఇంత రెస్పాన్స్ వస్తే, సినిమా విడుదలయ్యాక ఎలా ఉండబోతుందో మరి.