English | Telugu
యన్ టి ఆర్, నాగచైతన్యల గుండమ్మ కథ
Updated : Apr 13, 2011
గతంలో ఇదే విశ్వవిఖ్యాతనటసార్వభౌమ, నటరత్న, డాక్టర్ యన్ టి రామారావు, నటసామ్రాట్ నాగేశ్వరరావు, నవరసనటసార్వభౌమ యస్ వి ఆర్, సావిత్రి, జమున , రమణారెడ్డి, రాజనాల, హరనాథ్, యల్ విజయలక్ష్మీ తదితరులు నటించగా, కమలాకర కామేశ్వరరావు దర్శకత్వంలో నిర్మించిన "గుండమ్మ కథ" చిత్రం తెలుగు సినీ పరిశ్రమలోనే ఒక ల్యాండ్ మార్క్ చిత్రంగా నిలిచింది. అదే చిత్రాన్ని ఇప్పుడు ఆనాటి మేటి హీరోల నట వారసులు జూనియర్ యన్ టి ఆర్, నాగచైతన్య హీరోలుగా, వాణిశ్రీని గుండమ్మగా నటింపజేస్తూ నిర్మించాలని రామానాయుడుగారి సంకల్పం. అది త్వరలో నెరవేరాలని ఆశిద్దాం.