English | Telugu

అక్క కంటే ముందుగానే

''ఏమైందీ ఈవేళ'' చిత్రంతో హీరోయిన్ గా పరిచయమైన కాజల్ అగర్వాల్ చెల్లెలు నిషా అగర్వాల్ ప్రస్తుతం సినిమాలు లేక కాస్త తన కెరీర్ కు స్వస్తి చెప్పే పనిలో పడింది. ఈ అమ్మడు గత కొంత కాలంగా ప్రేమాయణం నడుపుతుందని పుకార్లు షికార్లు చేస్తున్న సంగతి అందరికి తెలిసిందే. అయితే తాజాగా మరి వార్త ఫిల్మ్ నగర్లో చక్కర్లు కొడుతుంది. ముంబైకి చెందిన బిజినెస్‌మెన్ కరణ్‌తో ప్రేమలో పడిన నిషా, వచ్చే డిసెంబర్ 28న ముంబైలో అంగరంగ వైభవంగా అతన్ని పెళ్లాడబోతోందట. అయితే ఈ విషయం విన్న ప్రతి ఒక్కరు కూడా అక్కకి లేని తొందర ఈ పిల్లకి ఎందుకని గుసగుసలు పెడుతున్నారు. మరి తన అక్క కాజల్ పెళ్లి అయ్యేవరకు ఓపికగా ఎదురుచూస్తదో, లేక తన అక్క కంటే ముందుగానే పెళ్లి చేసుకొని అక్కకి షాక్ ఇస్తదో త్వరలోనే తెలియనుంది. ఈ విషయంపై ఈ అక్క చెల్లెళ్ళు ఎలా స్పందిస్తారో త్వరలోనే తెలియనుంది.