English | Telugu
సంక్రాంతికి 1 పెద్ద షాక్
Updated : Jan 10, 2014
"ఎప్పుడొచ్చమని కాదన్నయ్య..బుల్లెట్టు దిగిందా లేదా.." పోకిరి సినిమాలో మహేష్ చెప్పిన డైలాగ్ ఇది ఎంత పాపులరో అందరికి తెలిసిందే. అయితే ఇదే డైలాగ్ ను "ఎన్ని కోట్ల బడ్జెట్టు కాదన్నయ్య.. కథ, కథనం బాగుందా లేదా అనేదే ముఖ్యం" అంటూ మార్చేసి, మహేష్ "1" సినిమాకు కౌంటర్ లు ఇస్తున్నారు ప్రేక్షకులు.
మహేష్ "1" నేడు ప్రపంచ వ్యాప్తంగా విడుదలైంది. సంక్రాంతి పండగను సంతోషంగా జరుపుకునే విధంగా ఉంటుందని భావించిన అభిమానులకు సంక్రాంతికి మహేష్ పెద్ద షాక్ ఇచ్చినట్లుగా అయ్యింది. సినిమా మొదటి షో నుంచి ఫ్లాప్ టాక్ ను సొంతం చేసుకుంది. సినిమా విడుదలకు ముందు నుండి భారీ అంచనాలను పెంచేసారు చిత్ర యూనిట్ సభ్యులు. ఆ అంచనాలు తారాస్థాయికి చేరడంతో.. "1" సినిమాను అభిమానులు మరింత ఎక్కువగా ఊహించుకున్నారు. దాంతో థియేటర్లో అభిమానులకు మహేష్ చుక్కలు చూపించినంత పని చేసాడు. కథ కొత్తగా ఉన్నప్పటికీ, దర్శకుడు తెరకెక్కించే విధానంలో ఫెయిల్ అయ్యాడు. హాలీవుడ్ రేంజులో మహేష్ ను చూపించాలని అనుకున్న దర్శకుడు సుకుమార్ తెలుగు ప్రేక్షకులను దృష్టిలో పెట్టుకోకపోవడం బాధకరం. ఏది ఏమైనా కూడా ఈ కొత్త సంవత్సరంలో తన సినిమాతో మహేష్ అందరికి పెద్ద షాక్ ఇచ్చాడని చెప్పుకోవచ్చు.