English | Telugu

బన్నీ ఇంకా తండ్రి అవ్వలేదంట...!

అల్లు అర్జున్(బన్నీ) తండ్రి అయ్యాడని, స్నేహా ఒక పండంటి పాపకు జన్మనిచ్చిందని గతకొన్ని రోజులుగా వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఈ వార్తల్లో ఎలాంటి నిజం లేదని బన్నీ తండ్రి అల్లు అరవింద్ తెలిపారు. అరవింద్ మాట్లాడుతూ.. "ప్రస్తుతం స్నేహా గర్భవతి, కానీ డెలివరికి ఇంకా సమయం ఉంది. డెలివరి అవ్వగానే మీడియాకు నేనే చెబుతాను. మీరు దయచేసి పుకార్లను నమ్మకండి" అని అన్నారు. ప్రస్తుతం బన్నీ "రేసుగుర్రం" షూటింగ్ లో బిజీగా ఉన్నాడు.