English | Telugu

పర్‌ఫెక్షన్‌ కోసం నిఖిల్‌ పడుతున్న పాట్లు

పర్‌ఫెక్షన్‌ కోసం నిఖిల్‌ పడుతున్న పాట్లు

‘హ్యాపీడేస్‌’ చిత్రంతో కెరీర్‌ స్టార్ట్‌ చేసిన హీరో నిఖిల్‌ తను చేసే ప్రతి సినిమా డిఫరెంట్‌గా ఉండేలా ప్లాన్‌ చేసుకుంటున్నాడు. ఆ సినిమా తర్వాత ఇప్పటివరకు అతను చేసిన సినిమాలన్నీ డిఫరెంట్‌ జోనర్స్‌లో వచ్చినవే. తాజాగా ‘స్వయంభు’ అనే సినిమా చేస్తున్నాడు.  ఠాగూర్‌ మధు సమర్పణలో పిక్సెల్‌ స్టూడియోస్‌ పతాకంపై భువన్‌, శ్రీకర్‌ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. భరత్‌ కృష్ణమాచారి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. రవి బస్రూర్‌ సంగీతం అందిస్తున్నారు.
ఈ సినిమాలో నిఖిల్‌ యోధుడిగా కనిపిస్తాడు. తన క్యారెక్టర్‌ కోసం నిఖిల్‌ ప్రత్యేక శిక్షణ తీసుకుంటున్నాడు. నెల రోజులపాటు  ఆయుధాలు, మార్షల్‌ ఆర్ట్స్‌, గుర్రపు స్వారీలలో శిక్షణ పొందేందుకు వియత్నాం వెళ్లారు. సైగాన్‌లోని టాప్‌ స్టంట్‌ మాస్టర్లు సినిమాలోని యాక్షన్‌ సీక్వెన్స్‌ల కోసం నిఖిల్‌కు శిక్షణ ఇస్తున్నారు. అంతేకాదు తన క్యారెక్టర్‌ డిమాండ్‌ మేరకు ఫిజికల్‌గా కూడా మేకోవర్‌ అవుతున్నారు. ఫర్‌ఫెక్షన్‌ కోసం నిఖిల్‌ ఎంతో కష్టపడుతున్నారు. 
నిఖిల్‌ చేస్తున్న 20వ సినిమా ఇది. ఇటీవల విడుదలైన ‘స్వయంభు’ ఫస్ట్‌లుక్‌కు మంచి స్పందన వచ్చింది. ఇప్పటివరకు ఈ తరహా క్యారెక్టర్‌ నిఖిల్‌ చెయ్యలేదు. అంతేకాదు అతని కెరీర్‌లో భారీ బడ్జెట్‌ చిత్రం ఇదే కావడం విశేషం.