English | Telugu

చంద్రబాబు ప్రతినిధి ఆడియో విశేషాలు

నారా రోహిత్ హీరోగా తెరకెక్కిన తాజా చిత్రం "ప్రతినిధి". ఈ చిత్రం ఆడియో విడుదల కార్యక్రమం నిన్న హైదరాబాద్ లో జరిగింది. ఈ కార్యక్రమానికి తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ముఖ్య అతిధిగా విచ్చేసారు.

ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ.... "యువతరంలో స్పూర్తిని రగిలించే అంశాన్ని కథగా ఎంచుకుని దర్శకుడు మంచి సినిమాని తెరకెక్కించారు. సమాజాన్ని ప్రక్షాలన చేస్తే ప్రపంచంలో మనదేశం మొదటిస్థానంలో నిలబడుతుంది. రాజకీయాల్లో పడిపోతున్న విలువలను నిలబెట్టేందుకు యువతరం రాజకీయాల్లోకి రావలసిన అవసరం ఉంది. నారా రోహిత్ "బాణం", "సోలో" చిత్రాల్లో మంచి ప్రతిభ కనబరిచాడు. ఈ చిత్రం కూడా మంచి విజయం సాధిస్తుంది" అని అన్నారు.

నారా రోహిత్ మాట్లాడుతూ.... " ఇది ఒక వైవిధ్యమైన కథ. ప్రస్తుత సమాజాన్ని ప్రతిబింబించేలా ఉంటుంది. దర్శకుడు ప్రశాంత్ మాండవ కి మొదటి చిత్రమైనప్పటికి కూడా చాలా చక్కగా తీశారు. సాయి కార్తీక్ చక్కటి సంగీతాన్ని అందించాడు అని అన్నారు.

ఈ చిత్రానికి ప్రశాంత్ మాండవ దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ చిత్రంలో నారా రోహిత్ సరసన శుభ్ర అయ్యప్ప హీరోయిన్ గా నటిస్తుంది. సాయి కార్తీక్ సంగీతాన్ని అందించాడు. త్వరలోనే ఈ చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.