English | Telugu

అల్లరోడి పెళ్ళాం హీరోయిన్ అయ్యిందోచ్...!

"కితకితలు" చిత్రంలో అల్లరి నరేష్ కు బండ భార్య గా, తన నటనతో మనల్ని కడుపుబ్బ నవ్వించిన నటి గీతాసింగ్ హీరోయిన్ గా మారింది. జి.మధుబాబు నటిస్తూ, స్వీయ దర్శకత్వంలో ఓ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్ర ముహూర్తపు కార్యక్రమాలు హైదరాబాద్ లో ప్రారంభమయ్యాయి. పూర్తి వినోదబరితంగా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో గీతాసింగ్ హీరోయిన్ గా నటిస్తుంది. ఈ చిత్రానికి సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలోనే తెలియనున్నాయి.