English | Telugu

డిసెంబ‌ర్ నుండి షూటింగ్‌కు వెళ్ల‌నున్న నాని, సాయిప‌ల్ల‌వి!

వ‌రుస‌గా ఆస‌క్తిక‌ర చిత్రాలు ఒప్పుకుంటూ వ‌స్తోన్న నాని చేయ‌బోతున్న మ‌రో ఇంట్రెస్టింగ్ మూవీ 'శ్యామ్ సింగ రాయ్‌'. ఈ మూవీకి 'టాక్సీవాలా' ఫేమ్ రాహుల్ సాంకృత్యాన్ డైరెక్ట‌ర్‌. ఇంత‌కుముందు నాని చేసిన సినిమా బ‌డ్జెట్‌తో పోలిస్తే ఎక్కువ బ‌డ్జెట్‌తో తీస్తున్న ఈ సినిమాని నిహారిక ఎంట‌ర్‌టైన్‌మెంట్ బ్యాన‌ర్‌పై వెంక‌ట్ బోయ‌న‌ప‌ల్లి నిర్మిస్తున్నారు. ఇప్ప‌టివ‌ర‌కు క‌నిపించ‌ని భిన్న‌మైన లుక్‌తో 'శ్యామ్ సింగ రాయ్‌లో' నాని క‌నిపించ‌నున్నాడు.

ఈ మూవీలో ఇద్ద‌రు హీరోయిన్లుగా సాయిప‌ల్ల‌వి, 'ఉప్పెన' ఫేమ్ కృతి శెట్టి ఫైన‌లైజ్ అయ్యారు. 'మిడిల్ క్లాస్ అబ్బాయి' (ఎంసీఏ) లాంటి హిట్ మూవీ త‌ర్వాత నాని, సాయిప‌ల్ల‌వి మ‌రోసారి జోడీ క‌డుతుండ‌టంతో ఈ సినిమాపై ఫ్యాన్స్ చాలా ఆశ‌లు పెట్టుకున్నారు. స‌త్య‌దేవ్ జంగా క‌థ‌ను అందించిన ఈ మూవీకి మెలీడీ ట్యూన్స్ స్పెష‌లిస్ట్ మిక్కీ జె. మేయ‌ర్ మ్యూజిక్ అందిస్తున్నాడు. స‌ను జాన్ వ‌ర్ఘీస్ సినిమాటోగ్రాఫ‌ర్‌గా, న‌వీన్ నూలి ఎడిట‌ర్‌గా వ‌ర్క్ చేస్తున్నారు.

నాని ప్ర‌స్తుతం చేస్తున్న 'ట‌క్ జ‌గ‌దీష్' మూవీ షూటింగ్ పూర్త‌వ‌గానే, డిసెంబ‌ర్‌లో 'శ్యామ్ సింగ రాయ్' సెట్స్ మీద‌కు వెళ్ల‌నున్న‌ది.