English | Telugu

బాలకృష్ణకు కొవిడ్ పాజిటివ్

సీనియ‌ర్ స్టార్ యాక్ట‌ర్‌ నందమూరి బాలకృష్ణకు కొవిడ్ పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. తాజాగా చేసిన కొవిడ్ పరీక్షల్లో బాలకృష్ణకు పాజిటివ్ అని నిర్ధారణ కావటంతో హోమ్‌ ఐసోలేషన్‌కు వెళ్లారు. "నాకు ఎలాంటి కోవిడ్ లక్షణాలు లేవు. పూర్తిగా ఆరోగ్యంతో ఉన్నా. గత రెండు రోజులుగా న‌న్ను కలిసిన వారు కూడా కోవిడ్ టెస్టు చేయించుకోవాలి. అందరూ కోవిడ్ నియంత్రణ చర్యలు పాటించాలి'' అని తెలిపారు బాలకృష్ణ.

ప్ర‌స్తుతం ఆయ‌న గోపీచంద్ మ‌లినేని ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తోన్న చిత్రంలో ప‌వ‌ర్‌ఫుల్ రోల్ పోషిస్తున్నారు. ఈ యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్‌ని మైత్రీ మూవీ మేక‌ర్స్ నిర్మిస్తోంది. ఈ మూవీలో బాల‌య్య జోడీగా శ్రుతి హాస‌న్ న‌టిస్తోంది.