English | Telugu
రాధేశ్యామ్, ఆర్ఆర్ఆర్.. మధ్యలో నల్లమల
Updated : Mar 1, 2022
అమిత్ తివారీ, భానుశ్రీ ప్రధాన పాత్రల్లో నటించిన సినిమా 'నల్లమల'. ఆర్.ఎమ్ నిర్మిస్తున్న ఈ మూవీ ద్వారా రవి చరణ్ దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. ఇప్పటికే విడుదలైన ఈ మూవీ ట్రైలర్ కు, సాంగ్స్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. తాజాగా ఈ మూవీ విడుదల తేదీని ప్రకటించారు మేకర్స్.
'నల్లమల' సినిమాని మార్చి 18 న విడుదల చేస్తున్నట్లు తెలుపుతూ తాజాగా మేకర్స్ ఓ పోస్టర్ ని విడుదల చేశారు. అడవిలో చేతిలో కత్తి పట్టుకొని శవాల మధ్యలో కూర్చొని ఉన్న అమిత్ లుక్ ఆకట్టుకుంటోంది. ఈ సినిమాపై మూవీ టీమ్ చాలా కాన్ఫిడెంట్ గా ఉంది. అందుకేనేమో ఏకంగా పాన్ ఇండియా సినిమాలు 'రాధేశ్యామ్', 'ఆర్ఆర్ఆర్' నడుమ విడుదలకు సిద్ధమైంది. 'నల్లమల' విడుదలకు వారం ముందు మార్చి 11 న రాధేశ్యామ్, విడుదలైన వారం తరువాత మార్చి 25 న ఆర్ఆర్ఆర్ విడుదల కానున్నాయి. మరి 'రాధేశ్యామ్', 'ఆర్ఆర్ఆర్' నడుమ విడుదలవుతున్న నల్లమల ఎలాంటి ఫలితాన్ని చూస్తుందో.
'నల్లమల' మూవీలో నాజర్, తనికెళ్ల భరణి, అజయ్ ఘోష్, కాలకేయ ప్రభాకర్ కీలక పాత్రలు పోషించారు. ఈ సినిమాకి పి.ఆర్ సంగీతం అందించాడు.