English | Telugu

పాతికేళ్ల తర్వాత తెలుగులో నటిస్తున్న జాతీయ ఉత్తమ నటి

ఆకాష్ పూరి హీరోగా నటిస్తున్న సినిమా 'చోర్ బజార్'. 'దళం', 'జార్జ్ రెడ్డి' సినిమాలతో డైరెక్టర్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్న జీవన్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో గెహన సిప్పీ హీరోయిన్. లవ్, యాక్షన్ ఎంటర్ టైనర్ గా రూపొందుతున్న ఈ సినిమాకి సంబంధించి కీలక అప్డేట్ వచ్చింది. ఈ సినిమాలో నిన్నటితరం ప్రముఖ నాయిక, జాతీయ ఉత్తమ నటి అర్చన కీలక పాత్రలో నటిస్తున్నట్లు తాజాగా మూవీ టీమ్ తెలిపింది.

ఇంగ్లీష్, బెంగాళీ సహా అన్ని ప్రధాన భారతీయ భాషా చిత్రాల్లో దశాబ్దాల కెరీర్ సాగించారు అర్చన. ఉత్తమ నటిగా వరుస సంవత్సరాల్లో రెండు జాతీయ అవార్డులు గెలుచుకున్నారు. వీడు(1987), దాసి(1988) చిత్రాలకు జాతీయ ఉత్తమ నటిగా పురస్కారాలు దక్కించుకున్నారు. తెలుగులో ఆమె నటించిన దాసి, నిరీక్షణ, భారత్ బంద్, లేడీస్ టైలర్ లాంటి చిత్రాలను ఇప్పటికీ ప్రేక్షకులు మర్చిపోలేదు. అలా జాతీయ ఉత్తమ నటిగా గుర్తింపు తెచ్చుకున్న అర్చన.. చోర్ బజార్ చిత్రంతో 25 ఏళ్ల తర్వాత మళ్లీ తెలుగు తెరపైకి వస్తున్నారు. ఈ సినిమాలో ఆమె పాత్ర కీలకంగా ఉంటుందని మూవీ టీమ్ చెబుతోంది.

ఐ.వి ప్రొడక్షన్స్ పతాకంపై వీ.ఎస్ రాజు నిర్మించిన చోర్ బజార్ సినిమా థియేటర్ లలో విడుదలకు సిద్ధమవుతోంది. సురేష్ బొబ్బిలి ఈ సినిమాకి సంగీతం అందిస్తున్నాడు.