English | Telugu
హ్యాపీ బర్త్ డే భాయ్
Updated : Aug 29, 2013
53ఏళ్ల వయసులో కూడా తన అందంతో ఇప్పుడున్న యువ హీరోలకు సైతం గట్టి పోటీని ఇస్తున్న కింగ్ నాగార్జున పుట్టినరోజు నేడు. అక్కినేని నాగేశ్వరరావు తర్వాత అక్కినేని వంశానికి దొరికిన మరో నటవారసుడు కింగ్ నాగార్జున. "విక్రమ్" చిత్రంతో తెలుగుతెరకు పరిచయమై, ఆ తర్వాత తనకంటూ ఓ ప్రత్యేక స్థానం కోసం చేసిన తొలి ప్రయత్నమే "గీతాంజలి". ఈ చిత్రం నాగార్జునకు లేడి ఫ్యాన్ ఫాలోయింగ్ ను పెంచడంలో కీలక పాత్ర వహించడంతో పాటు నటుడిగా మంచి గుర్తింపు సంపాదించుకున్నాడు.
శివ, నిన్నే పెళ్ళాడతా.., మన్మధుడు, మాస్, సూపర్, అన్నమయ్య, శ్రీరామదాసు,కింగ్, గగనం, రాజన్న, షిర్డీ సాయి వంటి బ్లాక్ బస్టర్ చిత్రాల్లో నటించి టాలీవుడ్ కింగ్ గా మారిపోయారు. అలాంటి ఈ మన్మధుడు త్వరలోనే "భాయ్" చిత్రంతో మన ముందుకు రాబోతున్నాడు. మరి ఈ చిత్రం నాగార్జున కెరీర్ లోనే మరో బ్లాక్ బస్టర్ హిట్టవ్వాలని కోరుకుంటూ.... మరోసారి నాగార్జున కి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తుంది తెలుగువన్.కామ్.