English | Telugu

కోడి రామకృష్ణ దర్శకత్వంలో నాగచైతన్య

కోడి రామకృష్ణ దర్శకత్వంలో నాగచైతన్య హీరోగా ఒక చిత్రం ప్రారంభం కాబోతోందని ఫిలిం నగర్ వర్గాల ద్వారా అందిన సమాచారం. వివరాల్లోకి వెళితే సీనియర్ దర్శకులు కోడి రామకృష్ణ దర్శకత్వంలో యువ హీరో నాగచైతన్య హీరోగా, ప్రతిష్టాత్మక సురేష్ ప్రొడక్షన్స్ పతాకంపై, మూవీమొగల్ డాక్టర్ డి.రామానాయుడు ఒక చిత్రాన్ని నిర్మిస్తున్నారట. గతంలో మహానటులు యన్.టి.ఆర్., ఎ.యన్.ఆర్., యస్.వి.ఆర్., సావిత్ర, జమున తదితరులు నటించిన "గుండమ్మ కథ" చిత్రానికి ఈ చిత్రం రీమేక్ అని ఫిలిం నగర్ లో అనుకుంటున్నారు.

అయితే "గుండమ్మ కథ" చిత్రంలో టైటిల్ పాత్రను అలనాటి మేటి నటి సూర్యాకాంతం అత్యంత అద్భుతంగా పోషించారు. ఈనాటి నటీమణుల్లో ఆ పాత్రను ఆ స్థాయిలో పోషించగల సత్తా ఉన్ననటి ఎవరూ నేడు కనపడరు. ఈ చిత్రంలో నాగచైతన్యతో పాటు జూనియర్ యన్ టి ఆర్ కూడా నటిస్తే ఆ నాటి మేటి నటుల వారసులుగా ఈ చిత్రంలో నటించిన ఘనత, ఆ చిత్రాన్ని నిర్మించిన కీర్తి రామానాయుడు గారికి దక్కేది. మరి జూనియర్ యన్ టి ఆర్ ఈ చిత్రంలో నటిస్తాడో లేదో ఇంకా తెలియరాలేదు.

బ్రహ్మానందం ఏజ్ డెబ్భై కాదా!... పిచ్చోళ్ళు ఎక్కడో ఉంటారని అనుకుంటాం కానీ 

నీ యంకమ్మ మా తాత చేసాడురా ఇదంతా.. నేను నోరెత్తి మాములుగా మాట్లాడితేనే బూతు అంటారండి బాబు.. పిచ్చోళ్ళు ఎక్కడో ఉంటారని అనుకుంటాం కానీ పక్కనే ఉంటారని తెలియదు. నువ్వెప్పడైనా ఎవరినైనా ప్రేమించావా శాస్త్రి.. ఖాన్ తో గేమ్స్ వద్దు, శాల్తీలు లేచిపోతాయ్. రావు గారు దయచేసి నన్ను ఇన్ వాల్వ్ చెయ్యకండి. ఎవర్ని రా పక్కకి రమ్మంటుంది, అవసరమైతే కొత్త ప్రపంచాన్ని సృష్టిస్తాను. చూసారా సార్ వీడి డబుల్ యాక్షన్.  ఏంటి బాబు అన్నావు, ఇంకో సారి అను. నిప్పుని కాల్చకండి, మీరు నిప్పుని కాల్చితే, నిప్పు మిమ్మల్ని కాల్చేస్తుంది.