English | Telugu

నాగార్జున, అనుష్క, రవితేజలపై ఐటి రైడ్స్

నాగార్జున, అనుష్క, రవితేజలపై ఐటి రైడ్స్ జరుగుతున్నాయి. మార్చ్ 23 వ తేదీ ఉదయం నుండీ యువ సామ్రాట్, కింగ్ అక్కినేని నాగార్జున, అందాల యోగా టీచర్ అనుష్క, మాస్ మహరాజా హీరో రవితేజ ఇళ్ళపై ఏక కాలంలో ఇన్ కంటాక్స్ డిపార్ట్ మెంట్దాడులు నిర్వహిస్తోంది. అంతే కాకుండా హీరో నాగార్జున అన్నగారైన అక్కినేని వెంకట్ ఇంటిపై కూడా ఆదాయపు పన్ను శాఖాధికారులు దాడులు చేస్తున్నారు. అలాగే నాగార్జునకు చెందిన అన్నపూర్ణ స్టుడియోలో కూడా సోదాలు నిర్వహిస్తున్నారు.

అంతే కాక కేవలం నాగార్జుతోనూ, ఆయన కుమారుడు నాగచైతన్యతోనూ మాత్రమే సినిమాలు నిర్మించే కామాక్షీ కళా మూవీస్ అధినేత, ప్రముఖ నిర్మాత డి.శివప్రసాద రెడ్డి ఇంటిపై కూడా ఆదాయపు పన్ను శాఖాధికారులు దాడులు నిర్వహిస్తున్నారు. ఈ దాడులన్నీ ఒకేసారి ఆదాయపు పన్ను శాఖాధికారులు నిర్వహించటం విశేషం. ఈ ఆదాయపు పన్ను శాఖాధికారుల దాడులకు కారణంగా ఒక విషయం వెలుగులోకి వచ్చింది.

ప్రముఖ నిర్మాత, లక్ష్మీ నరసింహా ప్రొడక్షన్స్ సంస్థ అధినేత బెల్లంకొండ సురేష్ ద్వారా మన సినీ నటీ, నటులందరూ విశాఖపట్టణంలో భూమిని కొనటం వల్ల వారి మీద ఈ ఆదాయపు పన్ను శాఖాధికారుల దాడులు జరుగుతున్నాయని విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసిన సమాచారం.

అవతార్ 3 ఫస్ట్ డే కలెక్షన్స్ ఇవే.. ఇండియాలో మాత్రం ఆ సినిమా దెబ్బకొట్టిందా!

జేమ్స్ కామెరూన్ నుంచి వచ్చిన మరో అద్భుత సృష్టి 'అవతార్ ఫైర్ అండ్ యాష్' నిన్న వరల్డ్ వైడ్ గా కనివిని ఎరుగని రీతిలో అత్యధిక థియేటర్స్ లో విడుదలైంది.ఒక్క ఇండియాలోనే అన్ని లాంగ్వేజెస్ లో కలిపి 5200 షోస్ ని ప్రదర్శించారంటే ఏ స్థాయిలో రిలీజ్ అయ్యిందో అర్ధం చేసుకోవచ్చు. దీంతో ప్రపంచ వ్యాప్తంగా ఉన్న సినీ ప్రేమికులు పెద్ద ఎత్తున థియేటర్స్ కి  పోటెత్తడంతో అన్ని చోట్ల హౌస్ ఫుల్ బోర్డ్స్ దర్శనమిచ్చాయి. తెలుగు రాష్ట్రాలతో సహా ఇండియా మొత్తం ఇంచుమించు అదే పరిస్థితి. దీంతో తొలి రోజు  అవతార్ ముంగిట భారీ కలెక్షన్స్ వచ్చి చేరాయి.