English | Telugu
పాట తప్ప రానా "నా ఇష్టం" పూర్తి
Updated : Feb 7, 2012
పాట తప్ప రానా "నా ఇష్టం" పూర్తి అయ్యిందని తెలిసింది. వివరాల్లోకి వెళితే యునైటెడ్ మూవీస్ పతాకంపై, యువహీరో దగ్గుబాటి రానా హీరోగా, జెనీలియా డిసౌజా హీరోయిన్ గా, ప్రకాష్ తోలేటిని దర్శకుడిగా పరిచయం చేస్తూ, పరుచూరి కిరీటి నిర్మిస్తున్న విభిన్నకథా చిత్రం "నా ఇష్టం". ఈ "నా ఇష్టం" చిత్రం ఒక్క పాట చిత్రీకరణ తప్ప సినిమా అంతా పూర్తయిందని ఈ చిత్రం యూనిట్ తెలిపింది. ఆ ఒక్క పాటను కూడా మలేసియాలో చిత్రీకరించటానికి సన్నాహాలు చేస్తున్నారు. ప్రేమ్ రక్షిత్ మాస్టర్ నేతృత్వంలో హీరో రానా ఇంట్రడక్షన్ సాంగ్ ని మలేసియాలో చిత్రీకరించనున్నారట.
ఈ "నా ఇష్టం" డబ్బింగ్ ఇప్పటికే పూర్తయింది. ఈ పాట కూడా పూర్తయితే చిత్రం ఫస్ట్ కాపీ రెడీ అవుతుంది. మార్చ్ ద్వితీయార్థంలో విడుదల కాబోతున్న ఈ "నా ఇష్టం" చిత్రం ఆడియోని ముంబాయికి చెందిన ఒక ప్రముఖ ఆడియో సంస్థ త్వరలో మార్కెట్లోకి విడుదల చేయనుంది. ఈ చిత్రానికి చక్రి చక్కని సంగీతం అందించారట.