English | Telugu
రౌడీ విడుదల మళ్ళీ వాయిదా
Updated : Mar 19, 2014
రాంగోపాల్ వర్మ దర్శకత్వంలో మోహన్ బాబు, విష్ణు ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం "రౌడీ". ఈ చిత్రాన్ని ఈనెల 28న విడుదల చేయాలని అనుకున్నారు కానీ కొన్ని అనివార్య కారణాల వలన ఏప్రిల్ 4న విడుదల చేయాలని నిర్ణయించారు. ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానున్న ఈ చిత్రంపై విష్ణు చాలా నమ్మకంతో ఉన్నాడు. ఇటీవలే విడుదలైన ట్రైలర్ కు మంచి స్పందన వస్తుంది. ఇందులో "సింహం అవ్వాలని ప్రతీ కుక్కకి ఉంటుంది... వీధిలో మొరగడానికి, అడవిలో గర్జించడానికి చాలా తేడా ఉంటుంది." వంటి డైలాగ్స్ అదరగొడుతున్నాయి. పార్థసారధి, గజేంద్ర, విజయ్ కుమార్ సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రంలో జయసుధ, శాన్వి కథానాయికలుగా నటించారు.