English | Telugu

కొత్త లుక్‌లో మోహన్‌బాబు.. నాని సినిమాకి పెరిగిన క్రేజ్‌!

నేచురల్‌ స్టార్‌ నానిని డిఫరెంట్‌గా ప్రజెంట్‌ చేస్తూ.. అతనికి ఒక కొత్త ఇమేజ్‌ని తీసుకురావాలని దర్శకుడు శ్రీకాంత్‌ ఓదెల విపరీతంగా ప్రయత్నిస్తున్నారు. నానికి దసరా వంటి బ్లాక్‌ బస్టర్‌ని ఇచ్చిన శ్రీకాంత్‌.. ఇప్పుడు చేస్తున్న సినిమా ‘ది ప్యారడైజ్‌’. ఈ సినిమా గ్లింప్స్‌ రిలీజ్‌ అయిన దగ్గర నుంచి సినిమా కోసం ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఈ సినిమాలో మోహన్‌బాబు ఒక కీలక పాత్రలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఆయన క్యారెక్టర్‌ ఎలా ఉంటుంది అనేది తెలియడం కోసం మోహన్‌బాబు లుక్‌ని విడుదల చేశారు. తన నేచురల్‌ యాక్టింగ్‌తో ఫ్యామిలీ ఆడియన్స్‌ని సైతం బాగా ఆకట్టుకున్న నాని ఈ సినిమాలో తన కొత్త లుక్‌తో అందరికీ షాక్‌ ఇచ్చాడు.

చాలా కాలం తర్వాత మోహన్‌బాబు ఒక కీలక పాత్రలో నటిస్తున్నారు. ఈ సినిమాలో అతని క్యారెక్టర్‌ ఎలా ఉండబోతోందనే క్యూరియాసిటీ అందరిలోనూ ఉంది. ప్రేక్షకులకు మరోసారి షాక్‌ ఇస్తూ మోహన్‌బాబు లుక్‌ రిలీజ్‌ చేశారు. అతని గెటప్‌ చూస్తుంటే సినిమాలో తన విశ్వరూపం చూపించాడేమో అనిపిస్తుంది. ఈ లుక్‌ విడుదలైన తర్వాత కెరీర్‌లో ‘ది ప్యారడైజ్‌’ మరో సెస్సేషనల్‌ మూవీ అవుతుందన్న పాజిటివ్‌ బజ్‌ వినిపిస్తోంది.

అవతార్ 3 ఫస్ట్ డే కలెక్షన్స్ ఇవే.. ఇండియాలో మాత్రం ఆ సినిమా దెబ్బకొట్టిందా!

జేమ్స్ కామెరూన్ నుంచి వచ్చిన మరో అద్భుత సృష్టి 'అవతార్ ఫైర్ అండ్ యాష్' నిన్న వరల్డ్ వైడ్ గా కనివిని ఎరుగని రీతిలో అత్యధిక థియేటర్స్ లో విడుదలైంది.ఒక్క ఇండియాలోనే అన్ని లాంగ్వేజెస్ లో కలిపి 5200 షోస్ ని ప్రదర్శించారంటే ఏ స్థాయిలో రిలీజ్ అయ్యిందో అర్ధం చేసుకోవచ్చు. దీంతో ప్రపంచ వ్యాప్తంగా ఉన్న సినీ ప్రేమికులు పెద్ద ఎత్తున థియేటర్స్ కి  పోటెత్తడంతో అన్ని చోట్ల హౌస్ ఫుల్ బోర్డ్స్ దర్శనమిచ్చాయి. తెలుగు రాష్ట్రాలతో సహా ఇండియా మొత్తం ఇంచుమించు అదే పరిస్థితి. దీంతో తొలి రోజు  అవతార్ ముంగిట భారీ కలెక్షన్స్ వచ్చి చేరాయి.