English | Telugu

500 కోట్లు రాబడుతుందా! రెండో రోజు కలెక్షన్ల తుఫాన్ 

ఒక పక్కన ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నా, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్(Pawan Kalyan)మాత్రం 'ఓజి'(OG)ద్వారా బాక్స్ ఆఫీస్ వద్ద అంతకు మించిన కలెక్షన్స్ తుఫాన్ ని సృష్టిస్తున్నాడు. తొలి రోజు ఈ చిత్రం వరల్డ్ వైడ్ గా 154 కోట్ల రూపాయల వసూలు చేసి, ఇండియన్ సినిమాకి మరోసారి తెలుగు సినిమా సత్తా చాటి చెప్పింది.

ఓజి రెండోరోజు కూడా మొదటి రోజుకి ఏ మాత్రం తీసిపోకుండా వరల్డ్ వైడ్ గా 52 కోట్ల రూపాయిల గ్రాస్ ని రాబట్టింది. దీంతో రెండు రోజులకి కలుపుకొని 206 కోట్ల రూపాయిల గ్రాస్ ని వసూలు చేసినట్లయింది. మరి వీకెండ్, దసరా కలిసి రావడం, ప్రేక్షకుల ముందు వేరే భారీ సినిమా లేకపోవడంతో లాంగ్ రన్ లో 500 కోట్లు రాబట్టే అవకాశం ఉందని అభిమానులు సోషల్ మీడియా వేదికగా వ్యక్తం చేస్తున్నారు. ఆన్ లైన్ బుకింగ్స్ కూడా పెద్ద ఎత్తున శని, ఆదివారాలు ఫుల్ కావడం కలిసి వచ్చే అంశం.

ఇక ఈ చిత్ర యూనిట్ విజయోత్సవ సభని పెద్ద ఎత్తున జరపడానికి ప్లాన్ చేస్తున్నట్టుగా వార్తలు వస్తున్నాయి. ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్(Hyderabad)లో జరిపారు కాబట్టి, ఏపి లోని విజయవాడ(Vijayawada)లో విజయోత్సవ సభ నిర్వహిస్తారనే టాక్ సినీ సర్కిల్స్ లో చక్కర్లు కొడుతుంది. పవన్ ఇటీవల చిన్నపాటి అస్వస్థతకి గురి కావడంతో ట్రీట్ మెంట్ తీసుకుంటున్నాడు. ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉంది.

అవతార్ 3 ఫస్ట్ డే కలెక్షన్స్ ఇవే.. ఇండియాలో మాత్రం ఆ సినిమా దెబ్బకొట్టిందా!

జేమ్స్ కామెరూన్ నుంచి వచ్చిన మరో అద్భుత సృష్టి 'అవతార్ ఫైర్ అండ్ యాష్' నిన్న వరల్డ్ వైడ్ గా కనివిని ఎరుగని రీతిలో అత్యధిక థియేటర్స్ లో విడుదలైంది.ఒక్క ఇండియాలోనే అన్ని లాంగ్వేజెస్ లో కలిపి 5200 షోస్ ని ప్రదర్శించారంటే ఏ స్థాయిలో రిలీజ్ అయ్యిందో అర్ధం చేసుకోవచ్చు. దీంతో ప్రపంచ వ్యాప్తంగా ఉన్న సినీ ప్రేమికులు పెద్ద ఎత్తున థియేటర్స్ కి  పోటెత్తడంతో అన్ని చోట్ల హౌస్ ఫుల్ బోర్డ్స్ దర్శనమిచ్చాయి. తెలుగు రాష్ట్రాలతో సహా ఇండియా మొత్తం ఇంచుమించు అదే పరిస్థితి. దీంతో తొలి రోజు  అవతార్ ముంగిట భారీ కలెక్షన్స్ వచ్చి చేరాయి.