English | Telugu
కామెడి మిర్చి కుర్రాడు
Updated : Apr 11, 2014
అభిజిత్, ప్రాగీ జైస్వాల్ జంటగా నటిస్తున్న చిత్రం "మిర్చి లాంటి కుర్రాడు". రుద్రపాటి రమణారావు నిర్మిస్తున్న ఈ చిత్రానికి జైనాగ్ దర్శకత్వం వహిస్తున్నారు. ప్రస్తుతం ఈ చిత్ర షూటింగ్ హైదరాబాదులో జరుగుతుంది.ఈ సందర్భంగా దర్శకుడు మాట్లాడుతూ... "మా మిర్చికి నవ్వుల ఘాటు ఎక్కువ. ఇందులో చక్కటి ప్రేమకథ కూడా ఉంటుంది" అని అన్నారు. నిర్మాత మాట్లాడుతూ.. "70 శాతం చిత్రీకరణ పూర్తయింది. వచ్చే నెల మొదటివారంలో పాటల్ని విడుదల చేస్తామ"న్నారు. త్వరలోనే ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నారు.