English | Telugu
మల్లిగాడు మ్యారేజ్ బ్యూరో పాటలు
Updated : Nov 30, 2013
శ్రీకాంత్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం "మల్లిగాడు మ్యారేజ్ బ్యూరో". ఈ చిత్ర ఆడియో విడుదల కార్యక్రమం ఇటీవలే హైదరాబాద్ లో జరిగింది. తొలి సీడీని దర్శకుడు వి.వి.వినాయక్ ఆవిష్కరించి, రాష్ట్ర మంత్రి గంటా శ్రీనివాసరావుకు అందజేశారు. ఈ సందర్భంగా శ్రీకాంత్ మాట్లాడుతూ... "చాలా రోజుల తర్వాత నేను నటిస్తున్న పూర్తిస్థాయి కామెడి చిత్రమిది. దర్శకుడు చక్కటి కథతో, చాల జాగ్రత్తగా తెరకెక్కించారు" అని అన్నారు. ఈ చిత్రానికి ఉదయ రాజ్ దర్శకత్వం వహించగా, రఘురాం సంగీతాన్ని అందించాడు. త్వరలోనే ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.