English | Telugu
మల్లెతీగగా మారిన రతిభామ
Updated : Dec 6, 2013
"రతినిర్వేదం" చిత్రంతో అభిమానులకు తన అందచందాలతో మత్తెక్కించిన బొద్దు సుందరి శ్వేతామీనన్ అందరికి తెలిసిందే. ఈ అమ్మడు ఇటీవలే మలయాళంలో "కలిమన్ను" అనే చిత్రంలో నటించింది. జాతీయ ఉత్తమ దర్శకుడు బెస్లీ ఈ చిత్రానికి దర్శకత్వం వహించాడు. శ్వేతా మీనన్, బిజు మీనన్, సునీల్ శెట్టి వంటి ప్రధాన తారాగణం నటించారు. ఇటీవలే విడుదలై సూపర్ హిట్టయింది. అయితే ఇపుడు ఇదే చిత్రాన్ని తెలుగులో "మల్లెతీగ" అనే పేరుతో బొద్దు దేవికిరణ్ డబ్బింగ్ చేస్తున్నారు. ఈ చిత్ర విశేషాల గురించి దేవి మాట్లాడుతూ.. ఈ కథకు సరిపోయే విధంగా ఈ టైటిల్ ను పెట్టడం జరిగింది. ఈ సినిమా అందరికి నచ్చుతుంది. శ్వేతా నటన చాలా బాగుంది. ప్రస్తుతం డబ్బింగ్ కార్యక్రమాలు జరుపుతున్నాం. త్వరలోనే పూర్తి చేసి విడుదల చేయనున్నాం. ఈ నెల రెండో వారంలో ఆడియోను విడుదల చేయనున్నామని తెలిపారు.