English | Telugu

డిసెంబర్ 22న 1 పాటలు

మహేష్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న తాజా చిత్రం "1 నేనొక్కడినే". మహేష్ సరసన కీర్తి సనన్ హీరోయిన్ గా నటిస్తోంది. దేవీశ్రీప్రసాద్ సంగీతాన్ని అందిస్తున్నాడు. "1 నేనొక్కడినే" పాటలను డిసెంబర్ 22న హైదరాబాద్ లో ఘనంగా విడుదల చేయనున్నారు. 14రీల్స్ ఎంటర్ టైన్మెంట్ బ్యానర్లో అనిల్ సుంకర, రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. మహేష్ ఈ సినిమాలో చాలా కొత్తగా కనిపించబోతున్నాడు. ఇటీవలే ఈ చిత్రానికి సంబంధించిన కొన్ని ఫోటోలను కూడా విడుదల చేశారు. హాలీవుడ్ హీరో రెంజులో మహేష్ కనిపిస్తుండటంతో అభిమానుల్లో ఈ సినిమాపై మరింత క్రేజ్ ని పెంచేలా చేసాయి.