English | Telugu

రాముడిగా మీరు ఊహించనంత అందాన్ని, పరాక్రమాన్ని మహేష్‌లో చూస్తారు!

మహేష్‌, రాజమౌళి కాంబినేషన్‌లో రూపొందుతున్న ‘వారణాసి’ చిత్రానికి సంబంధించి నవంబర్‌ 15న రామోజీ ఫిలింసిటీలో జరిగిన గ్లోబ్‌ ట్రాటర్‌ ఈవెంట్‌లో మహేష్‌ గురించి, సినిమా పట్ల అతనికి ఉన్న ప్యాషన్‌ గురించి, అతని క్రమశిక్షణ గురించి మాట్లాడారు రాజమౌళి.

‘మహేశ్‌బాబు నుంచి మనం ఎంతో నేర్చుకోవాల్సింది ఉంది. అతను సెట్‌లో అడుగు పెట్టాడు అంటే సెల్‌ ఫోన్‌ అనేది అతని దగ్గర ఉండదు. కారులోనే పెట్టేసి వస్తాడు. షూటింగ్‌ పూర్తి చేసి కారెక్కిన తర్వాతే సెల్‌ ఫోన్‌ వాడతారు. ఇప్పటి జనరేషన్‌లో అది చాలా గొప్ప విషయం. నా డ్రీమ్‌ ప్రాజెక్ట్‌ మహాభారతం అని ఎప్పుడూ చెప్తూ ఉంటాను. నాకు రామాయణం, మహాభారతం అంటే ఎంతో ఇష్టం. నేను రామాయణంలోని సీన్స్‌ తీస్తానని ఎప్పుడూ అనుకోలేదు. ఈ సినిమా కోసం ఒక్కో సీన్‌ రాస్తుంటే నేను గాలిలో ఉన్నానేమో అనిపించింది. మహేష్‌.. కృష్ణుడిగా అయితే బాగుంటాడని నా ఫీలింగ్‌. కానీ, ఫస్ట్‌ రోజే అతనికి రాముడి వేషం వేస్తుంటే నాకే గూస్‌బంప్స్‌ వచ్చాయి. మీరు ఊహించనంత అందంగా, పరాక్రమంగా, కోపంగా మహేశ్‌ కనిపిస్తాడు. రాముడిగా అన్ని రసాలు పలిపించేశాడు. ఆ ఫోటోని మొదట నేను నా ఫోన్‌లో వాల్‌పేపర్‌గా పెట్టుకున్నారు. ఎవరైనా చూస్తారేమోనని మళ్ళీ తీసేశాను’ అంటూ మహేష్‌ని ‘వారణాసి’ చిత్రంలో రాముడిగా చూపించబోతున్న విషయాన్ని రివీల్‌ చేశారు.

అవతార్ 3 ఫస్ట్ డే కలెక్షన్స్ ఇవే.. ఇండియాలో మాత్రం ఆ సినిమా దెబ్బకొట్టిందా!

జేమ్స్ కామెరూన్ నుంచి వచ్చిన మరో అద్భుత సృష్టి 'అవతార్ ఫైర్ అండ్ యాష్' నిన్న వరల్డ్ వైడ్ గా కనివిని ఎరుగని రీతిలో అత్యధిక థియేటర్స్ లో విడుదలైంది.ఒక్క ఇండియాలోనే అన్ని లాంగ్వేజెస్ లో కలిపి 5200 షోస్ ని ప్రదర్శించారంటే ఏ స్థాయిలో రిలీజ్ అయ్యిందో అర్ధం చేసుకోవచ్చు. దీంతో ప్రపంచ వ్యాప్తంగా ఉన్న సినీ ప్రేమికులు పెద్ద ఎత్తున థియేటర్స్ కి  పోటెత్తడంతో అన్ని చోట్ల హౌస్ ఫుల్ బోర్డ్స్ దర్శనమిచ్చాయి. తెలుగు రాష్ట్రాలతో సహా ఇండియా మొత్తం ఇంచుమించు అదే పరిస్థితి. దీంతో తొలి రోజు  అవతార్ ముంగిట భారీ కలెక్షన్స్ వచ్చి చేరాయి.