English | Telugu

నాగార్జున, మంచు విష్ణు కీలక నిర్ణయం 

నాగార్జున, మంచు విష్ణు కీలక నిర్ణయం 

దక్షిణ భారతీయ చిత్ర సీమలో తెరకెక్కిన అతి పెద్ద మల్టీస్టారర్ చిత్రాల్లో 'కుబేర'(Kuberaa)కూడా ఒకటి. అగ్ర హీరోలు నాగార్జున(Nagarjuna)ధనుష్(Dhanush)కలిసి ఫస్ట్ టైం స్క్రీన్ షేర్ చేసుకుంటున్న ఈ మూవీపై ఇరువురి అభిమానులతో పాటు ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. రష్మిక(Rashmika)హీరోయిన్ గా ఒక కీలక పాత్రలో కనపడుతుండగా, జిమ్ సర్బ్, షాయాజీ షిండే, దలిప్ తాహిల్ లాంటి నటులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. విభిన్న చిత్రాల మేకర్ శేఖర్ కమ్ముల(Sekhar Kammula)దర్శకత్వంలో సునీల్ నారంగ్, రామ్ మోహన్ రావు నిర్మాతలు. ప్రచార చిత్రాలు ఒక రేంజ్ లో ఉండంతో కుబేరపై అందరిలోను ఆసక్తి నెలకొని ఉంది.

ఈ మూవీ జూన్ 20 న పాన్ ఇండియా స్థాయిలో తెలుగుతో పాటు తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో రిలీజ్ కాబోతుంది. దీంతో చిత్ర బృందం ప్రమోషన్స్ లో వేగాన్ని పెంచింది. అందులో భాగంగా ఈ రోజు హైదరాబాద్ లో అభిమానుల సమక్షంలో ప్రీ రిలీజ్ ఈవెంట్ ని ఘనంగా జరపాలని నిర్ణయించింది. కానీ గుజరాత్ లో జరిగిన ఘోర విమాన ప్రమాదం కారణంగా ఎంతో మంది చనిపోవడంతో, చిత్ర బృందం తమ ఈవెంట్ ని వాయిదా వేస్తున్నట్టు సోషల్ మీడియా ద్వారా తెలియచేసింది. కొత్త డేట్ పై త్వరలోనే  ప్రకటన వచ్చే అవకాశం ఉంది.

మంచు విష్ణు(Manchu Vishnu),మోహన్ బాబు(Mohan Babu)ప్రెస్టేజియస్ట్ మూవీ 'కన్నప్ప'(Kannappa)టీం ఈ రోజు ఇండోర్ లో నిర్వహిద్దామని అనుకున్న ప్రీ రిలీజ్ ఈవెంట్, ట్రైలర్ లాంచ్ ని గుజరాత్  విమాన ప్రమాదం దృష్ట్యా వాయిదా వేసింది. కన్నప్ప  జూన్ 27 న వరల్డ్ వైడ్ గా రిలీజ్ కానున్న విషయం తెలిసిందే. 

 

 

నాగార్జున, మంచు విష్ణు కీలక నిర్ణయం