English | Telugu

ఇరవై రోజుల్లో విజయ్ సేతుపతి సినిమా ఓటిటిలోకి.. ఏం జరిగింది అసలు 

'మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి'(vijay Sethupathi)గత నెల 23 న 'ఏస్'(Ace)అనే మూవీతో తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. రొమాంటిక్ కామెడీ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ మూవీలో 'రుక్మిణి వసంత్'(Rukmini Vasanth)హీరోయిన్ గా చెయ్యగా, దివ్య పిళ్లై, యోగిబాబు బిఎస్ అవినాష్ కీలక పాత్రల్లో కనిపించారు. ఆరుముగ కుమార్(Arumuga Kumar)స్వీయ దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కింది.

అమెజాన్ ప్రైమ్ వీడియో వేదికగా 'ఏస్' ఈ రోజు నుంచి స్ట్రీమింగ్ కి వచ్చేసింది. ఎలాంటి అధికార ప్రకటన లేకుండా ఇరవై రోజులలోనే డైరెక్టర్ గా ఓటిటిలోకి రావడం విశేషం. నేరస్తుడిగా జైలు జీవితం గడిపి వచ్చిన బోల్డ్ కాశీ, జాబ్ కోసం మలేసియా వెళ్లి ఒక హోటల్ లో పనికి చేరతాడు. ఆ తర్వాత రుక్మిణి ప్రేమలో పడతాడు .ఆమెని ఆర్ధికంగా ఆదుకోవడానికి ఒక క్లబ్ లో జూదం ఆడతాడు. అందులో జరిగిన మోసం వల్ల రెండు కోట్ల వరకు బాకీ పడటంతో తన ప్రాణాలపైకి వస్తుంది. ఈ క్రమంలో ఒక బ్యాంక్ దొంగతనానికి పాల్పడతాడు. ఆ తర్వాత ఏం జరిగిందనేదే ఈ చిత్ర కథ .

పలు రకాల పార్శ్యాలు ఉన్న కాశీ క్యారక్టర్ లో విజయ్ సేతుపతి మరోసారి తన నట విశ్వరూపాన్ని చూపించాడు. రుక్మిణి క్యారక్టర్ లో రుక్మిణి వసంత్ కూడా ఒదిగిపోయి నటించింది. నూట యాభై నాలుగు నిమిషాల డ్యూరేషన్ ఈ చిత్ర నిడివి.