English | Telugu

అడుక్కొని వెల్లనంటున్న సీనియర్ నటి

భారతీయ సినీ పరిశ్రమ వందేళ్లు పూర్తిచేసుకున్న సందర్భంగా చెన్నైలో వందేళ్ళ భారతీయ సినిమా వేడుకలు జరుగుతున్న విషయం అందరికి తెలిసిందే. అయితే ఈ వేడుకకు తనకు ఎలాంటి పిలుపు రాలేదని నటి కవిత అన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ... "నేను పరిశ్రమలో 35 ఏళ్లుగా ఉన్నాను. నేను 130 సినిమాల్లో హీరోయిన్ గా నటించాను. 150కిపైగా క్యారక్టర్ ఆర్టిస్టుగా చేశాను. నేను నటించిన సినిమాలు సిల్వర్ జూబ్లీలు ఆడాయి. నేను ఇంకా సినీపరిశ్రమకు దూరం కాలేదు. ఇక్కడ ఎవరిని కాకా పడితే వారికే పిలుపులు అందుతున్నాయి. అలా కాకాపట్టి, అడుక్కుని ఫంక్షన్లకు వెళ్లాల్సిన అవసరం నాకు లేదు. నన్నే కాకుండా ఇంకా చాలామంది సీనియర్లను ఈ వేడుకకు ఆహ్వానించకుండా అవమానించారు. నిన్నటితరం వారితో కాకుండా, నిన్నా మొన్నా వచ్చిన వారితో అక్కడ వేడుకలను నిర్వహించడం చాలా బాధాకరం" అని ఆమె అన్నారు.