English | Telugu
కాంతార చాప్టర్ 1 కి సంబంధించి మరో నటుడి మృతి.. వరుస మరణాలకి కారణం ఏంటి?
Updated : Jun 14, 2025
కాంతార చాప్టర్ 1(kantara Chapter 1)ని మేకర్స్ ఏ ముహూర్తాన స్టార్ట్ చేసారో గాని, అందులో నటిస్తున్న వాళ్లంతా ఒక్కక్కొరిగా హఠాన్మరణంతో చనిపోతున్నారు. గత 'మే' నెలలో కపిల్ అనే నటుడు నీళ్ళల్లో పడి మృతి చెందాడు. అదే నెలలో రాకేష్ పూజారి అనే మరో నటుడు గుండెపోటుతో చనిపోయాడు. అంతకు ముందు జూనియర్ ఆర్టిస్టులు ప్రయాణిస్తున్న వ్యాన్ ప్రమాదానికి గురయ్యింది.
రీసెంట్ గా 'కళాభవన్ నిజు'(Kalabhavan Niju)అనే నటుడు చనిపోయినట్టుగా కన్నడ సినీ సర్కిల్స్ లో వార్తలు వస్తున్నాయి. కన్నడ స్థానిక మీడియాలో వస్తున్న దాని ప్రకారం చాప్టర్ 1 షూటింగ్ ప్రస్తుతం బెంగుళూరులో జరుగుతుంది. అందులో భాగంగా కళాభవన్ గురువారం రాత్రి సెట్ లోకి అడుగుపెట్టాడు. ఆ తర్వాత వెంటనే ఛాతి నొప్పితో పడిపోవడంతో చిత్ర యూనిట్ సమీపంలోని హాస్పిటల్ కి తీసుకెళ్లింది. కాని అప్పటికే కళాభవన్ మరణించినట్టుగా డాక్టర్స్ చెప్పారని కన్నడ మీడియాలో వార్తలు వస్తున్నాయి. కళాభవన్ స్నేహితుడు మిమిక్రి ఆర్టిస్ట్ కన్నన్ సాగర్ కూడా కళాభవన్ మరణ వార్తని ధ్రువీకరించాడు. చిత్ర బృందం మాత్రం మరణ వార్తపై క్లారిటీ ఇవ్వలేదు.
రిషబ్ శెట్టి స్వీయ దర్శకత్వంలో పాన్ ఇండియా స్థాయిలో సంచలన విజయాన్ని అందుకున్న 'కాంతార' కి ఫ్రీక్వెల్ గా 'కాంతార చాప్టర్ 1 తెరకెక్కుతుంది. దీంతో మూవీ కోసం అభిమానులతో పాటు, మూవీ లవర్స్ ఎంతో ఆసక్తితో ఎదురుచూస్తున్నారు. అలాంటిది ఈ చిత్రంలో నటించిన ముగ్గురు మృత్యవాత పడటం వాళ్ళందర్నీ కలవరపాటుకి గురి చేస్తుంది. పీరియాడిక్ యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కుతున్న ఈ మూవీని 'కేజిఎఫ్' ఫేమ్ హోంబులే సంస్థ భారీ వ్యయంతో నిర్మిస్తుంది. గాంధీ జయంతి(Gandhi Jayanthi)సందర్భంగా అక్టోబర్ 2 న విడుదల కానుంది.
