English | Telugu

లిప్ కిస్ పెడితేనే సీన్ పండుతుందని చెప్పి పెట్టించారు..ఎడిటింగ్ లో తీసేసారు

రోజా, జెంటిల్ మెన్, అల్లరి ప్రియుడు వంటి చిత్రాలతో తెలుగు ప్రేక్షకులని అలరించిన తమిళ హీరోయిన్ 'మధుబాల'. ముఖ్యంగా రోజా సినిమాలోని ఆమె నటనకైతే ప్రేక్షకలోకం నీరాజనాలు పలికింది. హిందీ చిత్ర సీమలో కూడా పలు హిట్ సినిమాల్లో నటించి తన సత్తా చాటిన మధుబాల, తన సెకండ్ ఇన్నింగ్స్ లో సైతం పలు చిత్రాల్లో కీలక పాత్రలు చేస్తు ప్రేక్షకులని అలరిస్తు వస్తుంది. అందులో భాగంగా మంచు విష్ణు ప్రెస్టేజియస్ట్ మూవీ 'కన్నప్ప' తో ప్రేక్షకుల ముందుకు రానుంది.

రీసెంట్ గా మధుబాల ఒక ఇంటర్వ్యూ ఇచ్చింది. అందులో ఆమె మాట్లాడుతు 'సినిమా రంగంలోకి అడుగుపెట్టినప్పుడు స్కిన్ షో, లిప్ కిస్ సన్నివేశాల్లో నటించకూడదనే, కొన్ని హద్దుల్నిపెట్టుకున్నాను. ఈ కారణంతోనే చాలా సినిమాలని వదులుకున్నాను. కాని ఒక సినిమా చేస్తున్నప్పుడు సినిమా మధ్యలో లిప్ కిస్ సన్నివేశంలో చెయ్యాలని, అలా చేస్తేనే సన్నివేశం పండుతుందని దర్శకుడు చెప్పాడు. దాంతో తప్పనిసరి పరిస్థితుల్లో ఓకే చెప్పాను. కానీ మూవీ రిలీజ్ అయ్యాక ఆ సన్నివేశం లేదు. కథకి అవసరం లేదని ఎడిటింగ్ లో తొలిగించేసారు.

షారుక్, సల్మాన్ సినిమాల్లో నటించే అవకాశం వచ్చి ఆ తర్వాత వేరే వాళ్ళకి అవకాశాలు వెళ్లాయి, బాజీగర్ మాత్రం నేనే క్యారక్టర్ నచ్చలేదని వదులుకున్నాను. దాంతో ఆ అవకాశం శిల్పా శెట్టి కి వెళ్లిందని మధుబాల చెప్పుకొచ్చింది. మధుబాల మాట్లాడిన మాటలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

అఖండ 2 ఆగినప్పుడు తెరవెనుక ఉంది వీళ్లే.. గంగాధర శాస్త్రి చెప్పిన పచ్చి నిజాలు  

నందమూరి నటసింహం గాడ్ ఆఫ్ మాసెస్ 'బాలకృష్ణ'(Balakrishana)పాన్ ఇండియా సిల్వర్ స్క్రీన్ వద్ద 'అఖండ 2'(Akhanda 2)తో కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ ని అందుకున్నాడు. దీంతో హిట్ ల శాతం తక్కువగా ఉన్న ప్రస్తుత సినీ యుగంలో వరుసగా ఐదు విజయాలని అందుకున్న హీరోగా  చరిత్రనే సృషించాడు . కలెక్షన్స్ పరంగా కూడా అఖండ 2 తొలి రోజు వరల్డ్ వైడ్ గా ప్రీమియర్స్ తో కలుపుకొని 59 .5 కోట్ల రూపాయిల గ్రాస్ ని అందుకోవడంతో అభిమానుల ఆనందానికి అవధులు లేకుండా పోతున్నాయి. మేకర్స్ కూడా త్వరలోనే రెండు తెలుగు రాష్టాల్లో సక్సెస్ సెలబ్రేషన్స్ ని జరుపుతున్నారు.