English | Telugu

థగ్ లైఫ్ తో కమల్ హిట్ కొట్టబోతున్నాడా! అసలు నిజం ఏంటి?

లోక నాయకుడు 'కమల్ హాసన్'(Kamal Haasan)నాలుగున్నర దశాబ్దాలపై నుంచే పాన్ ఇండియా స్టార్ గా కొనసాగుతు వస్తున్నాడు. 2010 లో 'విశ్వరూపం' తో హిట్ ని అందుకున్న కమల్, మళ్ళీ 2022 లో 'విక్రమ్' తో హిట్ ని అందుకున్నాడు. ఆ గ్యాప్ లో చేసిన సినిమాలన్నీ దాదాపుగా పరాజయాన్ని చవిచూడటంతో, కమల్ పని అయిపోయిందనే విమర్శలు వచ్చాయి. అలాంటిది విక్రమ్ తో బ్లాక్ బస్టర్ అందుకొని విమర్శకుల నోళ్లు మూయించాడు. కానీ గత ఏడాది శంకర్ దర్శకత్వంలో వచ్చిన భారతీయుడు పార్ట్ 2 దారుణ పరాజయాన్ని చవిచూడటంతో మళ్ళీ విమర్శలు మొదలయ్యాయి.

సరిగ్గా ఈ టైంలోనే స్టార్ డైరెక్టర్ 'మణిరత్నం'(Mani Rathnam)దర్శకత్వంలో 'థగ్ లైఫ్'ని అనౌన్స్ చేసాడు. పైగా ఈ చిత్రానికి కమల్ నే మూలకథ అందించడంతో పాటు, మణిరత్నం(Mani Rathnam)కమల్ కలిసి నిర్మిస్తున్నారు. దీంతో అభిమానులతో పాటు, ప్రేక్షకుల్లో 'థగ్ లైఫ్' పై ఆసక్తి పెరిగింది. పైగా మూడు దశాబ్దాల క్రితం ఈ ఇద్దరి కాంబోలో వచ్చిన 'నాయగాన్', దక్షిణ భారతీయ చిత్ర సీమలో ఒక ప్రభంజనాన్ని సృష్టించింది. తెలుగులో 'నాయకుడు' పేరుతో రిలీజ్ అయ్యి బ్లాక్ బస్టర్ హిట్ ని అందుకుంది. దీంతో లాంగ్ గ్యాప్ తర్వాత ఆ కాంబో రిపీట్ కావడంతో 'థగ్ లైఫ్' పై పాన్ ఇండియా లెవల్లో భారీ క్రేజ్ తో పాటు క్యూరియాసిటీ పెరిగింది. అలాంటిది 'థగ్ లైఫ్' నుంచి 'ఫస్ట్ గ్లింప్స్' రాగానే, కమల్, మణిరత్నం ల మ్యాజిక్ మరో సారి రిపీట్ కావడం ఖాయమనే నమ్మకం అందరిలో ఏర్పడింది. ట్రైలర్ తర్వాత అయితే విమర్శకుల నోళ్లు కమల్ మూయించడం ఖాయమని ఫిక్స్ అయ్యారు. .

అన్ని భాషలకి సంబంధించిన ప్రమోషన్స్ లో కమల్ తో పాటు చిత్ర బృందం మొత్తం పాల్గొని సినిమా హిట్ అనే నమ్మకాన్ని వ్యక్తం చేస్తుంది.ఇక తమిళ భాషలో నుంచే కన్నడ భాష పుట్టిందని కమల్ చేసిన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. దీంతో కమల్ క్షమాపణ చెప్పకపోతే థగ్ లైఫ్ రిలీజ్ ని అడ్డుకుంటామని కన్నడ సంఘాలు ప్రకటించాయి. ఈ నేపథ్యంలో కన్నడ నాట 'థగ్ లైఫ్' రిలీజ్ అవుతుందో లేదో అనేది ఆసక్తిగా మారింది. కమల్ మాత్రం ప్రేమ పూర్వకంగా ఆ మాట్లాడిన మాటలు క్షమాపణ చెప్పవనే ప్రకటన చేసాడు.