English | Telugu
కమాల్ ఖాన్ కు సర్దార్ ప్రమోషన్ కు పదిలక్షలు కావాలట
Updated : Mar 22, 2016
తొలిసారి హిందీలో అడుగుపెడుతున్న పవన్, తన సర్దార్ ప్రమోషన్లో భాగంగా దైనిక్ జాగరణ్ ఫిల్మ్ ఎడిటర్ అజయ్ బ్రహ్మాత్మజ్ కు ఇంటర్వ్యూ ఇచ్చాడు. పవన్ తో మాట్లాడి, దగ్గర్నుంచి చూసిన తర్వాత పవన్ చాలా తెలివైన వ్యక్తి అని, వర్కింగ్ శైలిలో కానీ, ఆలోచనా విధానంలో గానీ, పవన్ చాలా ముందున్నారని చెబుతూ, పవన్ ను గౌరవించమని కమాల్ ఖాన్ కు అజయ్ ట్వీట్ చేశారు.
దానికి రిప్లైగా నేను సౌత్ ఇండియాలో చెత్త సినిమాలను ప్రమోట్ చేయాలంటే నా ఫీజు పది లక్షలు. వెంటనే అతన్ని నాకు పంపించమని చెప్పండి అని ట్వీట్ చేశాడు కమాల్ ఖాన్. పైగా హీరో ఎవరో మృగమెవరో మీరే డిసైడ్ చేస్కోండి అంటూ తన ఫోటో, పవన్ ఫోటో పెట్టాడు. ఇది చూసి పవన్ ఫ్యాన్స్ కోపంతో ఊగిపోతున్నారు. ట్విట్లర్లో ఖాన్ కు సరైన బుద్ధి చెబుతామంటున్నారు. అయినా ఈ కమాల్ ఖాన్ కు ఇదేం ఆనందమో. బుద్ధిగా తన పనేదో తాను చేసుకోక, తెలుగు హీరోల అభిమానులతో పెట్టుకుంటున్నాడు. ఇక్కడి జనాలు హీరోను ఎంతలా అభిమానిస్తారో కమాల్ కు ఇంకా తెలిసినట్టు లేదు. మరో వైపు, కేవలం పవన్ తో ఇంటర్వ్యూ చేస్తున్నందుకే, అజయ్ బ్రహ్మాత్మజ్ పేరు హైదరాబాద్ ట్రెండింగ్ టాపిక్స్ లో టాప్ కు వచ్చేయడం విశేషం.