English | Telugu
సర్దార్ గబ్బర్ సింగ్ కు కబురు పంపిన బాహుబలి
Updated : Mar 22, 2016
సర్దార్ గబ్బర్ సింగ్ ఆడియో ఫంక్షన్లో చిరంజీవి మాట్లాడుతూ, బాహుబలి రికార్డ్స్ ను గబ్బర్ సింగ్ బద్ధలు గొట్టాలి. ఈ రికార్డ్స్ ను ఇండస్ట్రీలోని మరో సినిమా బ్రేక్ చేయాలి అని కోరుకున్నారు. ఇప్పుడు ఎగ్జాక్ట్ గా అదే విషయాన్ని బాహుబలి టీం కూడా కోరుకుంటున్నారు. పవన్ తో పాటు, మూవీ టీం అందరికీ ఈ సినిమా అద్భుతంగా ఆడాలని, తమ రికార్డ్స్ బ్రేక్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామంటూ బాహుబలి టీం కబురు పంపారట.
సర్దార్ అయినా, బాహుబలి అయినా, తెలుగువారి ప్రతిభను, స్థాయిని దేశవ్యాప్తంగా చాటాలని తాము కోరుకుంటున్నామంటూ జక్కన్న రాజమౌళి విష్ చేశాడు. ఆయనతో పాటు, ప్రభాస్, రానా, తమన్నా, అనుష్క, చిత్ర నిర్మాతలు కూడా సర్దార్ కు ఆల్ ది బెస్ట్ చెప్పారు. తెలుగుతో పాటు, హిందీలో కూడా రికార్డులన్నింటినీ సర్దార్ తిరగరాయాలని బాహుబలి టీం కు శుభాకాంక్షలు చెప్పారు. ప్రస్తుతం ఇది టాక్ ఆఫ్ ది టి టౌన్ గా మారింది. ఇలా ఒక మూవీ టీం, మరో మూవీ టీంకు విషెస్ చెప్పడమనేది చాలా మంచి సంప్రదాయంగా పరిశ్రమ పెద్దలు అభినందిస్తున్నారు.