English | Telugu
పవన్ ఒక్కడినే డైలాగ్ వెనక ఉద్దేశ్యం ఇదా..!
Updated : Mar 22, 2016
ఒక్కడినే. ఒక్కడినే.. ఎక్కడికైనా ఇలాగే వస్తా, ఇలాగే ఉంటా. జనంలో ఉంటా. జనంలా ఉంటా. ఇదీ పవన్ సర్దార్ లో చెప్పిన డైలాగ్. ఇప్పుడు పొలిటికల్ గా ఈ డైలాగ్ చాలా ప్రాధాన్యతను సంతరించుకుంది. ట్రైలర్ లో ఉన్న ఈ డైలాగ్ కేవలం సినిమా వరకే పరిమితమా లేక పవన్, మొత్తం అందరికీ ఇచ్చిన సైలెంట్ సందేశమా..? మన హీరోలు చాలా మంది తమ మనసులో ఉన్న మాటను డైలాగుల ద్వారా ఎవరికి కొట్టాలో వాళ్లకు కొడుతుంటారు. అందుకే కేవలం సినిమాలో డైలాగే అయినా, దీని గురించి ఇంత చర్చ నడుస్తోంది.
సైద్ధాంతిక విభేదాలతో అన్నయ్య చిరంజీవి దారి నుంచి విడిపోయి జనసేన ద్వారా తన దారి ఏర్పరుచుకున్నాడు పవన్. ఇప్పటి వరకూ జనసేనకు నాయకుడు, సేవకుడు, స్పోక్స్ పర్సన్, కార్యకర్త అన్నీ పవన్ ఒక్కరే. అనఫీషియల్ గా లక్షలాది మంది జనసేన కార్యకర్తలున్నా, ఇప్పటి వరకూ కార్యాచరణ ప్రకటన లేని కారణంగా, ప్రస్తుతానికి పవన్ ఒక్కరే జనసేన పార్టీ లెక్కలోకి వస్తారు. సర్దార్ ఆడియో లో చిరు పవన్ ను ఉద్దేశించి మాట్లాడుతూ, నువ్వు జోడు గుర్రాల స్వారీ చెయ్..నీ వెనక మేమంతా ఉన్నాము అన్నారు. దీంతో 2019 ఎన్నికల సమయానికి చిరు పవన్, జనసేన జెండా కింద ఒకటవుతారనే అభిప్రాయాన్ని చాలామంది వ్యక్తం చేశారు. బట్ పవన్ డైలాగ్ అందుకు విరుద్ధంగా ఉంది. నేనొక్కడినే ఉంటా అన్న పవన్ మాట వెనుక నిగూఢార్ధం ఏమయ్యుంటుందనేదే అసలు ప్రశ్న. చిరు మీద పవన్ కున్న ప్రేమ ఏమాత్రం తగ్గలేదనేది ఆడియో ఫంక్షన్ తో సుస్పష్టం. మరి పవన్ ఏం చేయబోతున్నారనేదానికి కాలమే సమాధానం చెప్పాలి.