English | Telugu
ఐశ్వర్యారాయ్ ప్లేస్ లోకి వచ్చేసిన సోనమ్ కపూర్
Updated : Mar 15, 2016
అందాల తారగా వరల్డ్ వైడ్ పేరు సంపాదించుకున్న ఐశ్వర్యారాయ్ పెళ్లి కాక ముందు చాలా కంపెనీలకు బ్రాండ్ అంబాసిడర్ గా ఉండేది. పిల్లలకు తల్లైన తర్వాత మాత్రం ఆమెకు బ్రాండింగ్ తగ్గుతోంది. తాజాగా గత మూడేళ్లుగా ఆమె బ్రాండింగ్ చేస్తున్న కళ్యాణ్ జూయలర్స్ తమ ప్రచారకర్తగా ఐశ్వర్య స్థానంలో సోనమ్ కపూర్ ను నియమించుకుంది. అమితాబ్ కుటుంబంలో ఐశ్వర్య, అమితాబ్, జయా బచ్చన్లతో ఇప్పటి వరకూ తమ బ్రాండ్ ను ప్రమోట్ చేసుకున్న కళ్యాణ్, కేవలం ఐశ్వర్య ను మాత్రమే తొలగించింది. తమ బ్రాండ్ ను ఎస్టాబ్లిష్ చేయడంలో ఐశ్వర్య కీలక పాత్ర పోషించినందుకు ధన్యవాదాలు చెబుతూ అమితాబ్, జయలతో తమ అసోసియేషన్ కొనసాగుతుందని కంపెనీ ప్రకటనలో తెలిపింది. సౌత్ ఇండియాలో కళ్యాణ్ జూయలర్స్ కు లో నాగార్జున, ప్రభు, శివరాజ్ కుమార్, మంజు వారియర్లు బ్రాండ్ అంబాసిడర్లుగా ఉన్నారు.