English | Telugu
సర్దార్ ఐటెం సాంగ్ లో బాగా ఎంజాయ్ చేసిందట
Updated : Mar 15, 2016
సర్దార్ గబ్బర్ సింగ్ లో స్పెషల్ సాంగ్ చేసింది రాయ్ లక్ష్మి. ఎప్పటినుంచో బ్రేక్ కోసం ఎదురుచూస్తున్న ఈ అమ్మడు, ఈ సాంగ్ తన జాతకాన్ని మార్చేస్తుందని ఆశలు పెట్టుకుంది. మరి పవర్ స్టార్ పక్కన ఐటెం సాంగ్ అంటే ఎనర్జీ మామూలుగా ఉంటుందా. సాంగ్ షూట్ ఎలా జరిగిందో, రాయ్ తన ఫేస్ బుక్ లో షేర్ చేసుకుంది. సర్దార్ ఐటెం సాంగ్ షూట్ చాలా సరదాగా సాగడమే కాక, పవన్ లాంటి ఒక మంచి వ్యక్తి తనకు తెలిసినందుకు చాలా హ్యాపీగా ఉందంటూ ఫేస్ బుక్ లో పోస్ట్ చేసింది. స్టేటస్ తో పాటు, పవన్ తో కలిసి ఉన్న ఫోటోను కూడా పెట్టింది. స్టిల్ బట్టి చూస్తే, సాంగ్ ను పవన్ ఏ రేంజ్ లో కుమ్మేసి ఉంటాడో ఊహించచ్చు. ప్రస్తుతం బ్యాలెన్స్ వర్క్ పూర్తి చేసే పనిలో ఉన్న సర్దార్, ఏప్రిల్ 8 న థియేటర్లలో సందడి చేయబోతున్నాడు.