English | Telugu
ఎమ్మెల్యేకు నరకంలో శిక్ష పడాలంటున్న త్రిష
Updated : Mar 15, 2016
హీరోయిన్ త్రిషకు మూగజీవాలంటే చాలా ఇష్టం. పెటా లాంటి జీవకారుణ్య సంస్థల తరపున ప్రచారం కూడా చేసింది. అవంటే అంత ప్రేమ ఉంది కాబట్టే ఆ ఎమ్మెల్యే పై ఇలాంటి వ్యాఖ్యలు చేసింది. విషయంలోకి వెళ్తే, ఉత్తరాఖండ్ లో బిజేపీ ఎమ్మెల్యే గణేష్ జోషి అనే ఆయన, ఆ రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళనకు దిగాడు. దాన్ని చెదరగొట్టడానికి పోలీసులు గుర్రాలపై వచ్చారు. దాంతో ఎమ్మెల్యే గారికి కోపం పెరిగిపోయింది. పోలీసుల్ని ఏమీ చేయలేక తన కోపాన్ని గుర్రంపై చూపించాడు. లాఠీతో చితకబాదడంతో గుర్రం కాలు విరిగిపోయింది. చికిత్సలో భాగంగా ఆ గుర్రం కాలు తీసేయాలని వైద్యులు సూచించారు. మూగజీవాన్ని కనికరం లేకుండా కొట్టిన జోషికి నరకంలో శిక్ష పడుతుందంటూ ట్వీట్ చేసింది త్రిష. అయినా ఏ పాపం తెలియని ఆ మూగజీవాన్ని కొట్టడానికి ఆ ప్రజా ప్రతినిధికి మనసెలా వచ్చిందో.