English | Telugu
ఈమె ఏకంగా క్రీం బిస్కెట్ వేసింది
Updated : Dec 23, 2013
మాములుగా సినిమా హీరోయిన్లు అన్నాక.. దర్శక, నిర్మాతలకు, హీరోలకు స్వీట్ గా మాట్లాడుతు బుట్టలో వేసుకునే ప్రయత్నం చేస్తారు. దీనినే బిస్కెట్ వేస్తుందని అంటారు. అయితే అందరు మాములు బిస్కెట్స్ మాత్రమే వేస్తే... కాజల్ అగర్వాల్ మాత్రం ఏకంగా టాలీవుడ్ కే పెద్ద క్రీం బిస్కెట్ వేస్తుంది. ఇంతకీ అసలు విషయమేమిటంటే... ఈ అమ్మడు ఇటీవలే ఓ వస్త్ర దుకాణం ప్రారంభోత్సవంలో పాల్గొన్నది. అయితే ఈ మధ్య కాజల్ తెలుగు సినిమాలకు దూరంగా ఉంటూ, తమిళ, హిందీ సినిమాలపైనే దృష్టి పెడుతుంది. ప్రస్తుతం ఈ అమ్మడు హీరోయిన్ గా ఏ సినిమా కూడా ఒప్పుకోలేదు. త్వరలోనే ఈ అమ్మడు తెలుగు సినిమాలకు దూరం కాబోతుంది అనే ప్రశ్నలకు సమాధానంగా కాజల్ మాట్లాడుతూ.. " నేను తెలుగు సినిమాకు దూరంగా ఉంటున్నాననడం కరెక్ట్ కాదు. రెండు భారీ తెలుగు చిత్రాల్లో నటించబోతున్నాను. ప్రస్తుతం ఆ సినిమాలకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్స్ పనులు జరుగుతున్నాయి. త్వరలోనే తెలుగు తెరపై కనిపిస్తాను. తెలుగు సినిమాకు నేను దూరం అవ్వడం అనేది జరిగితే... అది నా కెరీర్ ముగిసిపోయకే" అని చెప్పుకొచ్చింది. ఇంకో విషయం ఏమిటంటే... ఈ అమ్మడు ఈ ప్రారంభోత్సవానికి హాజరయినందుకు 25 లక్షలు పారితోషకంగా తీసుకుందని తెలిసింది. మరి ఈ అమ్మడు ఈ విధంగా సంపాదిస్తూ.. ఇలా క్రీం బిస్కెట్లు వేస్తుంది.