English | Telugu
అపోలోలో చేరిన మేస్ట్రో ఇళయరాజా
Updated : Dec 23, 2013
ప్రముఖ సంగీత దర్శకుడు ఇళయరాజా కొన్ని గంటల క్రితం చెన్నైలోని అపోలో హాస్పిటల్ లో చేరారు. గతకొంత కాలంగా ఇళయరాజా గుండె నొప్పితో బాధపడుతున్నాడని తెలిసింది. ప్రస్తుతం వైద్యుల సంరక్షణలో ఆయన బాగానే ఉన్నారని తెలిసింది. ఇది కేవలం మాములు స్ట్రోక్ మాత్రమే. ఆయనకి ఎలాంటి ప్రమాదం లేదు. రెండు,మూడు రోజుల్లోనే డిశ్చార్జ్ చేసి, ఇంటికి తీసుకెళ్లవచ్చని అక్కడి వైద్యులు తెలిపినట్లు తెలిసింది. మరి మేస్ట్రో ఇళయరాజాకు ఆరోగ్యం బాగుపడి త్వరలోనే తన సంగీతంతో మనల్ని అలరించాలని కోరుకుందాం.