English | Telugu
రేపే నాని జెండా సౌండ్
Updated : Dec 27, 2013
నాని నటిస్తున్న తాజా చిత్రం "జెండాపై కపిరాజు". ఈ చిత్ర ఆడియో విడుదల కార్యక్రమం రేపు శిల్పకళా వేదికలో జరగబోతుంది. సముద్రఖని దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని కె.ఎస్.శ్రీనివాస్ నిర్మిస్తున్నారు. జి.వి.ప్రకాష్ కుమార్ సంగీతాన్ని అందిస్తున్నాడు. అమలాపాల్ హీరోయిన్ గా నటిస్తుంది. ఈ చిత్రంలో నాని రెండు పాత్రలలో నటిస్తున్నాడు. త్వరలోనే ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నారు. అలాగే నాని నటించిన "పైసా" చిత్రం కూడా విడుదలకు సిద్దంగా ఉంది.